Viral Video: కుష్టు రోగులకు సేవ.. పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల స్వామి శివానంద.. వీడియో వైరల్

|

Mar 23, 2022 | 11:36 AM

Viral Video: పద్మశ్రీ (Padma Shri) అవార్డును అందుకున్న 125 ఏళ్ల స్వామి శివానంద (swami sivananda) .. ఈ వయసులో కూడా తన పనులు తానే చేసుకుంటారు. నిత్యం యోగా సాధన చేసే..

Viral Video: కుష్టు రోగులకు సేవ.. పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల స్వామి శివానంద.. వీడియో వైరల్
Swami Sivananda
Follow us on

Viral Video: పద్మశ్రీ (Padma Shri) అవార్డును అందుకున్న 125 ఏళ్ల స్వామి శివానంద (swami sivananda) .. ఈ వయసులో కూడా తన పనులు తానే చేసుకుంటారు. నిత్యం యోగా సాధన చేసే స్వామి శివానంద 125 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా.. ఆరోగ్యంగా ఉన్నారు. దేశంలో కరోనా రెండు డోసులు టీకా తీసుకున్న అత్యంత పెద్ద వయస్కుడు కూడా స్వామి శివానంద. నిరుపేద కుటుంబంలో పుట్టి.. తల్లిదండ్రులను కోల్పోయిన స్వామి శివానంద సన్యాసం తీసుకుని సజాసేవకు అంకితం చేశారు. ఆయన జీవితం .. ఎందరికో స్ఫూర్తిదాయకం.

1896 ఆగస్టు 8న అప్పటి భారతదేశంలోని సిల్హెత్.. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నిరుపేద కుటుంబంలో జన్మించారు. స్వామిజీ ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని ఓ ఆశ్రమయంలో గురు ఓంకారనంద గోస్వామి పెంచి పెద్ద చేశారు. అక్కడ యోగా, ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొన్న స్వామి శివానంద అనంతరం సన్యాసం తీసుకున్నారు. తన జీవితాన్ని సమాజసేవకు  అంకితం చేశారు. పూరిలో గత 50 ఏళ్లుగా 400-600మంది కుష్టు రోగులకు సేవ చేస్తున్నారు.

ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించింది. తాజాగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ పురస్కారాల కార్యక్రమానికి హాజరైన శివానంద అత్యంత సామాన్యుడిగా వచ్చి పురష్కారం అందుకున్నారు. తెల్లటి ధోవతి, కుర్తా ధరించి కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా అత్యంత సాదాసీదాగా పురష్కారం అందుకోవడానికి వచ్చిన స్వామి శివానందను చూసి ఎమోషన్ కు గురిచేసింది. చూసి అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు. అయితే స్వామి అవార్డుని అందుకునేందుకు వేదిక మీదకు వస్తూ.. మొదట ప్రధాని మోడీ కి నేలమీదకు వంగి నమస్కారం చేశారు. ఇది అక్కడ ఉన్న అందరినీ షాక్ కు గురిచేసింది. అదే సమయంలో మోడీ కూడా మొత్తం కిందకు భూమిని తాకేలా వంగి స్వామికి ప్రతి నమస్కారం చేశారు. స్వామిజీకి తగిన గౌరవం ఇచ్చాడు.

అనంతరం ఇదే విధంగా రాష్ట్రపతికి ఇలానే పాదాభివందనం చేశారు. వెంటనే రాష్ట్రపతి వారించి పైకి లేపి అలా చేయకూడదని అవార్డును అందజేశారు. శివానంద సంస్కరానికి హాలులో ఉన్నంత వారంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు.

ఈ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సహా ఆనంద్ మహీంద్రాతోపాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్వామి శివానంద తీరును కొనియాడారు. హృదయాలను కదిలిస్తున్న వీడియో అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read:    100 కోట్ల ల‌గ్జరీ హెలికాప్టర్‌ కొన్న మొద‌టి భార‌తీయుడు.. దీని స్పెషలిటీ ఏమిటంటే..!