Viral Video: నీ తెలివికి ఓ దండంరా అయ్యా.. పడగవిప్పి బుసలు కొడుతోన్న కింగ్‌ కోబ్రాకు ఎలా కళ్లెం వేశాడో మీరే చూడండి

|

Aug 19, 2022 | 5:05 PM

King Cobra: గతంలో ఇంట్లో పాములు దూరినప్పుడు వాటి కోసం ప్రత్యేకంగా పొగ వేసి మరీ ఇంటి నుంచి తరిమేసేవారు. ఈ పొగతో వాటికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి దూరంగా పారిపోతాయి.

Viral Video: నీ తెలివికి ఓ దండంరా అయ్యా.. పడగవిప్పి బుసలు కొడుతోన్న కింగ్‌ కోబ్రాకు ఎలా కళ్లెం వేశాడో మీరే చూడండి
King Cobra
Follow us on

King Cobra: గతంలో ఇంట్లో పాములు దూరినప్పుడు వాటి కోసం ప్రత్యేకంగా పొగ వేసి మరీ ఇంటి నుంచి తరిమేసేవారు. ఈ పొగతో వాటికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి దూరంగా పారిపోతాయి. అలాగే పాములను పట్టేందుకు కొన్ని ప్రత్యేక పనిముట్లు కూడా ఉండేవి. అయితే ప్రస్తుతం ఆ రోజులు పోయాయి. ఇంట్లో పాములు దూరితే విషసర్పాలు పట్టడంలో ఎంతో అనుభవమున్న స్నేక్‌ క్యాచర్లను పిలుస్తున్నారు. అయితే కొన్ని పాములు వారికి కూడా లొంగడం లేదు. ఈక్రమంలో ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన కింగ్‌ కోబ్రాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు ఓ ట్రైనర్‌. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది.

ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత విషపూరితమైన పాముగా కింగ్‌కోబ్రాకు పేరుంది. అందుకే దాని పేరు వింటేనే జడుసుకుంటారు చాలామంది. అలాంటి పాము ఇంట్లోకి దూరితే అంతే సంగతులు.. సౌత్ ఆసియాలో అలాంటి సంఘటనే జరిగింది. ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన కింగ్‌కోబ్రాను చూసి అందరూ హడలెత్తిపోతారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందిస్తారు. అయితే అతనికి కూడా ఝలక్‌ ఇచ్చిన కింగ్‌ కోబ్రా అతని నుంచి తప్పించుకోవడానికి ఒక పరదా కిందకు పోయి దాక్కుంటుంది. స్నేక్‌ క్యాచర్‌ పరదా తీయగానే ఒక్కసారిగా బుసలు కొడుతూ పడగ విప్పుతుంది. కొద్ది సేపటి తర్వాత దాని తోకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే కోబ్రా కాటేయడానికి దూసుకొస్తుంది. అయినా సరే అతను వెనకడుగు వేయడు. తోక, తల పట్టుకుని దానిని అడవిలో వదిలిపెట్టాలన్నది అతని ప్లాన్‌. అయితే స్నేక్‌ క్యాచర్‌ ఎంత సేపు ప్రయత్నించినా పాము తన తలను పట్టుకోనివ్వదు. దీంతో అతను తన మెదడుకు పని చెబుతాడు. తెలివిగా ఓ ప్లాస్లిక్‌ కవర్‌ తెస్తాడు. పడగ విప్పిన పాము తలపై ఆ కవర్‌ వేస్తాడు. పాము తల కవర్లో ఉన్నప్పటికీ.. అది బుసలు కొడుతూనే ఉంటుంది. చివరకు ఓ పెద్ద స్టిక్‌ సహాయంతో కవర్‌ లోపలికి పామును తోస్తాడు. ఆపై అక్కడి నుంచి తీసుకెళ్లి అడవిలో వదులుతాడు. కాగా ఇది పాత వీడియో అయినప్పటికీ ఇప్పుడు బాగా వైరలవుతోంది. యూట్యూబ్‌లో ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్‌ వస్తున్నాయి. అలాగే లక్షలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. చూసిన వారందరూ ‘ నీ తెలివికి ఓ దండం రా అయ్యా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..