
Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్యర్యకంగా ఉంటే మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. ఏదైనా వీడియో వైరల్ అయ్యిందంటే అది సోషల్ మీడియా అని చెప్పక తప్పదు. సామాజిక మాధ్యమాల్లో ప్రతి రోజు పులులు, సింహాలు, మొసళ్లు, పాములు వంటి జంతువుల వీడియో ఎక్కువ వైరల్ అవుతుంటాయి. ఇక ముంగిస-పాము అంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. వీటి మధ్య శతృత్వం అంతా ఇంత కాదు. పాము-ముంగిస బద్ద శత్రువులు. ఇవి రెండు ఎదురు పడ్డాయంటే చాలు భీకర పోరు కొనసాగాల్సిందే.
ఈ రెండింటిలో ఏది గెలుస్తుందని చెప్పడం చాలా కష్టం. పాము బుసలు కొడుతూ వస్తుంటే.. దానిపై ముంగిస ఎదురు దాడికి దిగుతుంటుంది. పామును చూస్తే ముంగిసకు ఎక్కడ లేని కోసం వచ్చేస్తుంటుంది. ఎంతటికైనా తెగించి పాముపై దాడికి దిగుతుంది ముంగిస. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నీటి మడుగులో ఉన్న నల్లత్రాచుతో ముంగిస ఫైటింగ్ కొనసాగుతోంది. రెండింటి మధ్య కొంత సేపు భీకర పోరు కొనసాగుతుంటుంది. రెండింటి మధ్య సాగే ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి