భారీ ఉడుమును అమాంతం మింగేందుకు యత్నించిన కళింగ పాము.. చివరకు !!
కళింగ పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. పాముల్లో కింగ్‌గా దీనికి పేరుంది. ఈ జాతి పాములు చాలా డేంజరస్. చాలా పొడవుగా ఉంటాయి. కర్ణాటకలో ఇవి తరచుగా కనిపిస్తాయి.
కళింగ పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. పాముల్లో కింగ్‌గా దీనికి పేరుంది. ఈ జాతి పాములు చాలా డేంజరస్. చాలా పొడవుగా ఉంటాయి. కర్ణాటకలో ఇవి తరచుగా కనిపిస్తాయి. తాజాగా బాగా ఆకలితో ఉన్న ఓ భారీ కళింగ పాము.. ఓ ఉడుమును వేటాడింది. మాటు వేసి దాన్ని పట్టేసింది. అయితే దాన్ని మింగేందుకు మాత్రం ఆపసోపాలు పడింది. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. సిర్సి సమీపంలో యానా క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ మరుగు ప్రాంతంలో ఉడుమును నోటబట్టిన సర్పం.. దాన్ని మింగేందుకు దాదాపు గంటపాటు విశ్వప్రయత్నం చేసింది. అయితే ఉడుము సైజ్ కూడా పెద్దదిగా ఉండటంతో.. పాము దానిని మింగలేకపోయింది. చివరికి దాన్ని వదిలిపెట్టింది. అయితే అప్పటికే ఊపిరాడక ఉడుము మరణించింది. ఈ షాకింగ్ దృశ్యాలను అటుగా వెళ్లే బైక్ రైడర్ ఫోన్‌లో షూట్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

