Viral Video: 5 రూపాయల కోసం గొడవ.. మహిళ క్యాబ్ డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్

|

Dec 11, 2023 | 4:29 PM

వైరల్ అయిన వీడియో క్లిప్ కొన్నిసెకన్ల నిడివి మాత్రమే. ఇందులో క్యాబ్ డ్రైవర్ నిర్దేశిత ప్రదేశంలో డ్రాప్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం వినవచ్చు. అయితే వాహనం ఎక్కువ దూరం ప్రయాణిస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే మహిళ అదనపు ఛార్జిని ఇవ్వడానికి వ్యతిరేకిస్తుంది. అంతేకాదు తాను ఎంచుకున్న గమ్యస్థానంలో దిగబెట్టాలని పట్టుబట్టింది. 'కారు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే.. అదనంగా డబ్బులు వసూలు చేస్తారు' అని డ్రైవర్.. మహిళపై పదే పదే అరుస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.

Viral Video: 5 రూపాయల కోసం గొడవ.. మహిళ క్యాబ్ డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్
Viral Video
Follow us on

ఓ మహిళ, క్యాబ్‌డ్రైవర్ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్యాసింజర్ ను లొకేషన్‌లో డ్రాప్ చేయడానికి క్యాబ్ డ్రైవర్ రూ. 100 డిమాండ్ చేయడం గమనించవచ్చు. అయితే ఎక్కే సమయంలో రూ.95 ఛార్జీ ఉండగా అది రూ.100 ఎలా అయింది? అంటూ ఆ  మహిళ డ్రైవర్ మాటలను రికార్డ్ చేయడం ప్రారంభించడంతో విషయం తీవ్రమైంది. దీని తర్వాత డ్రైవర్ మరింత కోపంగా మహిళలతో వాదించడం మొదలు పెట్టాడు.

వైరల్ అయిన వీడియో క్లిప్ కొన్నిసెకన్ల నిడివి మాత్రమే. ఇందులో క్యాబ్ డ్రైవర్ నిర్దేశిత ప్రదేశంలో డ్రాప్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం వినవచ్చు. అయితే వాహనం ఎక్కువ దూరం ప్రయాణిస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే మహిళ అదనపు ఛార్జిని ఇవ్వడానికి వ్యతిరేకిస్తుంది. అంతేకాదు తాను ఎంచుకున్న గమ్యస్థానంలో దిగబెట్టాలని పట్టుబట్టింది. ‘కారు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే.. అదనంగా డబ్బులు వసూలు చేస్తారు’ అని డ్రైవర్.. మహిళపై పదే పదే అరుస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. అంతేకాదు తన అభిప్రాయాన్ని ఆ మహిళకు వివరించడంలో విఫలమయ్యాడు. ఐదు రూపాయల విషయంలో ఇద్దరి మధ్య వాదన కొనసాగింది.

ఇవి కూడా చదవండి

క్యాబ్ డ్రైవర్‌తో మహిళ వాగ్వాదానికి దిగిన వీడియో

 

క్యాబ్ కంపెనీ ఏం చెప్పింది?

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో లఫ్‌డావ్‌లాగ్ అనే ఖాతాలో షేర్ చేయబడింది. క్లిప్‌లో ఇచ్చిన క్యాప్షన్ ప్రకారం  డ్రైవర్ కంపెనీ Indriveతో అనుబంధించబడ్డాడు. ఈ వీడియోపై ఆ సంస్థ కూడా స్పందించింది. మా ప్లాట్‌ ఫారమ్‌లో డ్రైవర్ అనుచిత ప్రవర్తనను అస్సలు సహించబోమని కంపెనీ తెలిపింది. ఈ విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ హామీ ఇచ్చింది.

నెటిజన్ల స్పందన..

అయితే ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళను జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఐదు రూపాయల కోసమే మీ భద్రతను పణంగా పెడుతున్నారా? చాలా బాగుంది. మరికొందరు వీరి ఇద్దరూ బిగ్ బాస్ చూస్తున్నారని అర్ధం అవుతుంది. మరొకరు ఒక్క 5 రూపాయలకు ఇంత గొడవా.. అసలు ఏమి జరుగుతోంది అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..