Viral Video: పూరీలను ఈజీగా చేస్తోన్న మహిళ.. ఈ ట్రిక్ చూస్తే వావ్ అంటారు.. వీడియో వైరల్
పూరీలు అంటే అందరికీ ఇష్టమే.. అయితే పూరీలను ఒత్తడం ఒక పెద్ద పని.. ఉరుకుల పరుగుల జీవితంలో పూరీలు చేయడం అంటే ఓపికకు పరీక్ష. అయితే రోలింగ్ పిన్ లేకుండా పూరీలు తయారు చేయడానికి ఒక మహిళ "అద్భుతమైన ట్రిక్"ను ఉపయోగించింది. ఇది చూసిన ప్రజలు దీని గురించి ముందే తెలిసి ఉంటే బాగుండు" అని అంటారు. ఈ అద్భుతమైన హ్యాక్ వీడియోను @pree_tikirasoi అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ అద్భుతమైన "జుగాడ్" వీడియో ఇప్పటివరకు 12 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది.

పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ పూరీలను ఇష్టంగా ఇంటారు. అయితే పూరీలను చుట్టడం చాలా కష్టమైన పని.. ముఖ్యంగా పూరీలను తయారు చేస్తున్నప్పుడు. రోలింగ్ పిన్ పట్టుకుని కూర్చోవడం నిజంగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక హ్యాక్ వైరల్ అవుతోంది. ఇది ప్రజలను ఆశ్చర్యపరిచింది. వైరల్ క్లిప్‌లో ఒక మహిళ రోలింగ్ పిన్ ఉపయోగించకుండా నిమిషాల్లో అధిక సంఖ్యలో పూరీలను తయారు చేసి వేయించడం కనిపిస్తుంది. ప్రజలు దీనిని “స్మార్ట్ ట్రిక్” అని పిలుస్తున్నారు. ఇది ముందే తెలుసుంటే బాగుండు అని కోరుకుంటున్నారు.
రోలింగ్ పిన్ లేకుండా ఎవరైనా ఇన్ని పూరీలను ఇంత త్వరగా ఎలా తయారు చేయగలరని ఆశ్చర్యపోతున్నారనడంలో సందేహం లేదు. ఈ మహిళ చేసిన హ్యాక్ ఎంత సింపుల్ గా ఉందో అంతే ప్రభావవంతంగా కూడా ఉంది.
ఈ ‘వైరల్ జుగాడ్’ ఏమిటంటే
ఈ వైరల్ వీడియోలో ఒక మహిళ అద్భుతమైన నింజా టెక్నిక్ ఉపయోగించి పూరీలు తయారు చేయడాన్ని మీరు చూస్తారు. ఆమె ముందుగా పూరీ పిండిని చిన్న చిన్న ఉండలుగా బంతులను చుట్టేసింది. తర్వాత, ఆమె వాటిలో 5-6 పిండి ఉండలను ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెట్టింది. తర్వాత.. ఆమె దానిపై మరొక ప్లాస్టిక్ షీట్ ఉంచి.. ఒక పెద్ద రౌండ్ స్టీల్ ప్లేట్ తో గట్టిగా నొక్కింది. ఇలా గట్టిగా ఆ పిండి ఉండలను చివరి వరకూ నొక్కడంతో.. ఆ పిండి ఉండలు.. గుండ్రని పూరీలుగా మారాయి. ఆ తర్వాత వాటిన్నితిని ఒక ప్లేట్ లోకి తీసుకుని వాటిని నూనె లో చకచక వేయించుకుంది. దీంతో పూరీలు చేయడం ఇంత ఈజీగా అనిపిస్తుంది ఈ వీడియో చూసిన వారికి ఎవరికైనా..
ఈ అద్భుతమైన హ్యాకింగ్ వీడియోను @pree_tikirasoi అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “ఒకేసారి ఇన్ని పూరీలు తయారు చేయండి” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేశారు. ఈ అద్భుతమైన “జుగాద్” 12 లక్షలకు పైగా వ్యూస్ ను, 125,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. అయితే చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను ఎడిట్ చేశారని అంటున్నారు. ఇలాంటి ట్రిక్ సాధ్యం కాదు అని అంటున్నారు. మరి మీరు ట్రై చేసి ఈ మహిళా చేసిన ట్రిక్ నిజమో అబద్దమో కనిపెట్టండి.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
మరిన్ని వీడియో వైరల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




