Viral Video: అదేంది బ్రో.. ఇంతకీ అది కారేనా… రోడ్డు మీద సగం కుంగిన కారు పరుగులతో జనం పరేషాన్‌

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో నెటిజన్స్‌ను అవాక్కయ్యేలా చేస్తుంది. రోడ్డుమీద పరుగులు పెడుతున్న కారును చూసి మిగతా వాహనదారులు నోరెళ్ల పెడుతున్నారు. కారు పరుగులు పెట్టడం సహజమే కదా.. దానికి నోరెళ్లపెట్టడం ఎందకు అనే కదా మీ ప్రశ్న...

Viral Video: అదేంది బ్రో.. ఇంతకీ అది కారేనా... రోడ్డు మీద సగం కుంగిన కారు పరుగులతో జనం పరేషాన్‌
Damage Care Running

Updated on: Jul 09, 2025 | 9:19 AM

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో నెటిజన్స్‌ను అవాక్కయ్యేలా చేస్తుంది. రోడ్డుమీద పరుగులు పెడుతున్న కారును చూసి మిగతా వాహనదారులు నోరెళ్ల పెడుతున్నారు. కారు పరుగులు పెట్టడం సహజమే కదా.. దానికి నోరెళ్లపెట్టడం ఎందకు అనే కదా మీ ప్రశ్న.. మీరు గనక ఈ వీడియో చూసినట్లయితే మీరు కూడా కళ్లు తేలేయడం ఖాయం. ఎందుకంటే కారు తీరు అలాగుంది మరి.

వైరల్ అవుతున్న వీడియోలో, మారుతి సుజుకి స్విఫ్ట్ కారు కుడి వైపు బాగానే ఉంది. కానీ, ఎడమ వైపు ఒక పెద్ద సుత్తితో నలగగొట్టినట్లుగా లోపలికి చొచ్చుకునిపోయి ఉంది. అదే సమయంలో, పైకప్పు కూడా లోపలికి కుంగిపోయింది. డ్రైవర్ వైపు తలుపు కొద్దిగా తెరిచి ఉంది. మొత్తం మీద, కారు మీరు ఊహించలేనంతగా పాడైపోయింది. అవతలి వైపు నుండి అది ఏ కంపెనీ వాహనం అని గుర్తించడం కూడా కష్టం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అయినప్పటికీ కారు వేగంగా నడుస్తోంది.

ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన మరొక కారు డ్రైవర్ వెంటనే తన ఫోన్ తీసి వీడియో తీయడం ప్రారంభించాడు. ఇప్పటివరకు మీరు సినిమాల్లో మాత్రమే ఇలా కారును ఢీకొట్టడం చూసి ఉంటారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. కారును చూసిన నెటిజన్స్‌ తెగ నవ్వుకుంటున్నారు.

వీడియో చూసిన తర్వాత, ఒక వినియోగదారుడు కారు మోడల్‌ని ఎగతాళి చేస్తూ, “చాలా వేగంగా డ్రైవింగ్ చేస్తున్నాను!” అని రాశాడు. మరొక వినియోగదారు దీనిని నేరుగా GTA (గ్రాండ్ తెఫ్ట్ ఆటో) తో పోల్చారు. ఆ వ్యక్తి నిజ జీవితంలో GTA ఆడుతున్నాడని కామెంట్‌ చేశాడు. అయితే కొంతమంది ఈ చర్యను తప్పుపడుతున్నారు. ఇలా చేయడం ద్వారా వారు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి: