
అడవిలో నివసించే వన్య ప్రాణులకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ వీడియో ప్రజలను ఆలోచింపజేస్తుంది. ఈ వీడియోలో ఒక చిరుతపులి తన అద్భుతమైన బలాన్ని ప్రదర్శిస్తూ.. ఒక పెద్ద మొసలిని వేటాడింది. అంతేకాదు ఆ మొసలిని తీసుకుని చెట్టు ఎక్కడం కనిపిస్తుంది. కొన్ని సెకన్ల ఈ క్లిప్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.
చిరుతపులి అద్భుతమైన చురుకుదనం, తెలివితేటల కారణంగా దీనిని ‘నిశ్శబ్ద కిల్లర్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది రెప్పపాటులో తన వేటపై దాడి చేస్తుంది. పులి, సింహం కంటే పరిమాణంలో చిన్నది అయినా చిరుత పులి వేటలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుడ్ని. ఇది వేటాడే శక్తి కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ చిరుతపులిలోని మరొక ప్రత్యేకతల ఒకటి ఏమిటంటే.. ఎరను వేటాడేటప్పుడు, తినడం కోసం కూడా ఎక్కువ సమయం చెట్లపైనే గడుపుతుంది.
ఇది తన వేటను చెట్టుపైకి తీసుకెళ్లి ఆనందిస్తుంది. తద్వారా సింహాలు, హైనాల నుంచి తన వేటను రక్షించుకుంటుంది. తమ వేటను చెట్ల కొమ్మలలో ఎత్తులో నిల్వ చేస్తాయి. తమ ఆహారాన్ని సురక్షితం చేసుకుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చిరుతపులిలోని ఈ లక్షణాన్ని చూపిస్తుంది. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే అమ్మో చిరుత పులి వేట ఎంత భయంకరంగా ఉంటుంది. ఎంత శక్తివంతమైన జీవి అని తప్పనిసరిగా ఆలోచిస్తారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిరుతపులి మొసలిని మెడ పట్టుకుని చెట్టు ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఈ నమ్మశక్యం కాని దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న పర్యాటకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తమ చేతిలో సెల్ ఫోన్లకు కెమేరాకు పని చెప్పి దానిని రికార్డ్ చేస్తున్నారు.
ఈ వీడియోను @soraia_cozzarin అనే ఖాతా సోరయా సిమోన్ సాట్లర్ కోజారిన్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 5 మిలియన్లకు పైగా వీక్షించారు. దాదాపు 3 లక్షల మంది లైక్ చేశారు. 3000 మంది కామెంట్ చేశారు.
200 పౌండ్ల మొసలిని నేల నుంచి అంత పైకి ఎత్తి తీసుకెళ్ళే శక్తి… నిజంగా నమ్మశక్యం కావడం లేదని కామెంట్ చేశారు. మరొకరు నేను హోండురాస్ నుంచి వచ్చాను. జాగ్వర్లు మన దేశంలో తిరుగుతాయి. ఈ జీవులు నది ఒడ్డున ఉన్న చెట్లపై విశ్రాంతి తీసుకుంటాయి. నదిలో మొసలి కనిపిస్తే దూకడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..