AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తల్లి ప్రేమ అంటే ఇదీ.. దూడపై దాడి చేసిన చిరుత.. రఫ్పాడించిన ఆవు..

తల్లి ప్రేమకు ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తుంది. తల్లి తన ప్రాణాలను లెక్కచేయకుండా క్రూర మృగానికి ఎదరొడ్డి నిలిచి బిడ్డ ప్రాణాలను రక్షించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ ఆవు ధైర్యం, అమ్మ ప్రేమ, ఆప్యాయతను ప్రశంసిస్తున్నారు.

Viral Video: తల్లి ప్రేమ అంటే ఇదీ.. దూడపై దాడి చేసిన చిరుత.. రఫ్పాడించిన ఆవు..
Cow Leopard Viral Video
Krishna S
|

Updated on: Aug 01, 2025 | 7:27 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక జంతువుల వీడియోలు అయితే జనాలు ఆసక్తిగా చూస్తారు. తాజాగా ఓ చిరుత, ఆవుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. ఇది తల్లి ధైర్యంగా పులిని ఎదురించి బిడ్డను రక్షించుకున్న ఘటన. ఈ వీడియోలో.. ఒక చిరుతపులి ఆవు దూడపై దాడికి దిగింది. ఇది చూసిన దూడ తల్లి.. దూరం నుంచి పరిగెత్తుకొచ్చి.. తన ప్రాణాలను కూడా పట్టించుకోకుండా పులికి ఎదురుతిరిగింది. దీంతో భయపడడం పులి వంతైంది.

ఆవు యొక్క ఉగ్ర రూపాన్ని చూసి భయపడిన చిరుత వెంటనే అక్కడి నుండి పారిపోయింది. ఆవు సరైన సమయంలో స్పందించకపోతే, దూడ చిరుతకు ఆహారంగా మారేది. ఈ ఘటన పాలిలో ఉన్న జవాయి చిరుత సాంక్చురీలో జరిగింది. ఓ వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘ఒక చిరుతపులి ఆవు దూడపై దాడికి దిగింది. అప్పుడు తల్లి ఎటువంటి భయం లేకుండా దూడను కాపాడటానికి పరిగెత్తింది” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన తర్వాత, నెటిజన్లు ఆవు ధైర్యం, తల్లి ప్రేమను ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలో అన్నింటికన్నా తల్లి ప్రేమే విలువైనదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..
పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి
మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి
పక్కా కొలతలతో రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే
పక్కా కొలతలతో రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే
పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా..
పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా..
బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?
బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం