Watch Video: ‘ఓరివారీ.. అదేమైనా పరుపు అనుకుంటివా’.. కరెంట్ పోల్‌ ఎక్కి పడుకున్న తింగరోడు..!

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వైరల్ అవుతుంటాయి. ఖాళీ సమయాల్లో ఆ వీడియోలను చూస్తూ సరదాగా కాలక్షేపం చేస్తుంటారు నెటిజన్లు. అయితే, వీటిలో కొన్ని వీడియో చాలా సరదాగా, ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆకట్టుకుంటాయి. ఇంకొన్ని వీడియోలైతే..

Watch Video: ‘ఓరివారీ.. అదేమైనా పరుపు అనుకుంటివా’.. కరెంట్ పోల్‌ ఎక్కి పడుకున్న తింగరోడు..!
Man Slept Current Pole

Updated on: Jun 11, 2023 | 6:08 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వైరల్ అవుతుంటాయి. ఖాళీ సమయాల్లో ఆ వీడియోలను చూస్తూ సరదాగా కాలక్షేపం చేస్తుంటారు నెటిజన్లు. అయితే, వీటిలో కొన్ని వీడియో చాలా సరదాగా, ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆకట్టుకుంటాయి. ఇంకొన్ని వీడియోలైతే.. ఎన్నిసార్లైనా షేర్ చేయాలనిపిస్తుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అదే సమయంలో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. వీడియోలో ఓ వ్యక్తి కరెంట్ స్తంభం ఎక్కి స్ట్రీట్‌లైట్ల మధ్య హాయిగా పడుకున్నాడు. మరి అతను ఎందుకిలా చేశాడు? ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? ఈ ఘటన ఎక్కడ జరిగింది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మద్యం ఒక వ్యక్తిని ఏ రకంగానైనా మార్చేస్తుంది. పరిమితికి మించి మద్యం సేవించిన వారు తాము ఏ స్థితిలో ఉన్నాం.. ఏం చేస్తున్నాం.. పరిస్థితి ఏంటి? అనే సంగతే తెలియకుండా ఉంటారు. తాజాగా ఈ వ్యక్తిది కూడా అదే పరిస్థితి. ఫుల్లుగా మద్యం సేవించిన ఈ వ్యక్తి.. నేరుగా విద్యుత్ స్తంభం ఎక్కాడు. పైన ఉన్న నాలుగు స్ట్రీట్ లైట్లనే తన పాన్పుగా భావించి.. వాటిపై హాయిగా కనుకుతీశాడు.

ఇవి కూడా చదవండి

స్తంభం ఎక్కిన వ్యక్తిని గమనించిన జనాలు షాక్ అయ్యారు. అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు. అతను ఎలా ఎక్కాడు? అక్కడెందుకు పడుకున్నాడు? అని ఆలోచనలో పడ్డారు జనాలు. ఎలక్ట్రిసిటీ అధికారులు, పోలీసులు వచ్చి అతన్ని కిందకు జాగ్రత్తగా దించారు. మద్యం మత్తులోనే అతను పైకి ఎక్కి పడుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో @zore_amol_ అనే అకౌంట్‌లో షేర్ చేశారు. ‘పవర్ ఆఫ్ దేశీ లిక్కర్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 67 వేలమందికిపైగా లైక్ చేశారు. యూజర్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..