Viral Video: ఈ రోడ్డేమన్నా నీ బాబు వేశాడా.. పక్కకు జరుగు! ఎద్దు చేసిన పనికి నెటిజన్స్‌ నవ్వులే.. నవ్వులు

కోపంగా ఉన్న ఎద్దులు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా ఉండదు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు మొదటిసారి ఇంత ఉదారమైన ఎద్దును...

Viral Video: ఈ రోడ్డేమన్నా నీ బాబు వేశాడా.. పక్కకు జరుగు! ఎద్దు చేసిన పనికి నెటిజన్స్‌ నవ్వులే.. నవ్వులు
Bull Warning

Updated on: Jul 29, 2025 | 12:23 PM

కోపంగా ఉన్న ఎద్దులు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా ఉండదు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు మొదటిసారి ఇంత ఉదారమైన ఎద్దును చూశాను అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కొన్ని సెకన్ల ఈ వీడియో ఎద్దు ‘సున్నితత్వాన్ని’ రుజువు చేస్తోంది. వీడియోలో ఓ సర్దార్జీని తప్పుకుని దారి ఇవ్వమంటూ ప్రేమగా సంజ్ఞ చేస్తున్నట్లు కనిపిస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు చూడవచ్చు. ఆ వ్యక్తులలో ఒకరు తన స్కూటర్‌పై కూర్చుని, మరొకరు ముందు నిలబడి ఉన్నారు. ఒక సర్దార్ జీ చేతులు ముడుచుకుని వారి మాటలు వింటున్నారు. అప్పుడు మచ్చల రంగులో ఉన్న ఒక ఎద్దు అటుగా వెళుతుంది. ఆ క్షణంలో జరిగిన సంఘటన చూసి నెటిజన్స్‌ చాలా ఆనందిస్తున్నారు.

వీడియోలో ఎద్దు సర్దార్ జీ దగ్గరకు వచ్చి, చాలా ప్రేమగా తన తలతో తన వీపును తోసి ముందుకు కదులుతుంది. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు, ఎద్దు సర్దార్ జీతో, హే పాజీ, మీరు మధ్యలో నిలబడి ఉన్నారు, దయచేసి పక్కకు వెళ్ళండి అని చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

వీడియో చూడండి:

 

వీడియో చూసిన నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ఎద్దు కూడా నేను ఈ రోజు దాడి చేసే మూడ్‌లో లేను అని చెబుతుండాలి అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరొకరు, పక్కకు వెళ్లిపోండి లేకపోతే నేను నిన్ను పొడిచేస్తాను అన్నట్లు ఉంది అని రాశారు. మొత్తంమీద, ఎద్దు వింత ప్రవర్తన నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.