Viral Video: పాపం..ఎరక్కపోయి ప్రియుడి భార్య చేతికే దొరికింది… నడి రోడ్డుమీద భర్త లవర్‌ను చితక్కొట్టిన భార్య

సమాజంలో వివాహేతర సంబంధాలు పెచ్చుమీరిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. మరికొన్ని ఘటనల్లో రెడ్‌హ్యాండెడ్‌గా లవర్‌తో దొరికిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రోడ్డుపై తన భర్తను అతని ప్రియురాలితో కలిసి చూసిన ఒక మహిళ, ఆమెపై దాడి...

Viral Video: పాపం..ఎరక్కపోయి ప్రియుడి భార్య చేతికే దొరికింది... నడి రోడ్డుమీద భర్త లవర్‌ను చితక్కొట్టిన భార్య
Woman Attack Husband Lover

Updated on: Jan 05, 2026 | 5:12 PM

సమాజంలో వివాహేతర సంబంధాలు పెచ్చుమీరిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. మరికొన్ని ఘటనల్లో రెడ్‌హ్యాండెడ్‌గా లవర్‌తో దొరికిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రోడ్డుపై తన భర్తను అతని ప్రియురాలితో కలిసి చూసిన ఒక మహిళ, ఆమెపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన డిసెంబర్ 28, ఆదివారం సాయంత్రం ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనను అక్కడున్నవారు వీడియో తీయగా అది తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోలీసుల ప్రకారం, భర్త తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుగుతున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. తర్వాత భార్య అక్కడికి చేరుకుంది. కానీ ప్రేమాయణం సాగిస్తున్న భర్త దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని పారిపోయాడు. గొడవ జరుగుతున్న సమయంలో భర్త అక్కడి నుంచి పారిపోగా, భార్య ప్రియురాలిని పట్టుకుంది. తన భర్తతో తిరగుతున్న మహిళను చెంపలు వాయించింది.

అయితే పోలీసులు వచ్చేలోపే స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇద్దరు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత తపపై దాడికి పాల్పడిందని ప్రియుడి భార్యపై ప్రియురాలు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తన భర్త వివాహేతర సంబంధంలో ఉన్నాడని, గతంలో తనను వేధించాడని భార్య ఆరోపించింది. ఈ ఆరోపణలపై ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వీడియో చూడండి: