Viral Video: తండ్రికి యాక్సిడెంట్.. కుటుంబాన్ని పోషించేందుకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారిన ఏడేళ్ల బాలుడు

|

Aug 04, 2022 | 5:34 PM

కస్టమర్‌కు ఆహారం అందజేయడానికి రాత్రి 11 గంటల వరకు సైకిల్ తొక్కుతున్నాడు. తలకు మించిన తండ్రి బాధ్యతను మోస్తున్న చిన్నారి బాలుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు.

Viral Video: తండ్రికి యాక్సిడెంట్.. కుటుంబాన్ని పోషించేందుకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారిన ఏడేళ్ల బాలుడు
7 Year Boy Viral Video'
Follow us on

Viral Video: చదువు ప్రతిభ అవకాశాలు అందుబాటులో ఉన్నా.. ఎదో తక్కువ అయిందంటూ.. నిరాశావాదంతో గడిపే నేటి ఎందరో యువతకు ఆదర్శం ఈ చిన్నారి బాలుడు.. తండ్రి ప్రమాదానికి గురైతే.. 7 ఏళ్ల బాలుడు కుటుంబానికి అండగా బిలబడ్డాడు. జొమాటో డెలివరీ బాయ్ గా మారి.. కస్టమర్స్ కు ఆహారాన్ని అందిస్తున్నాడు. కస్టమర్‌కు ఆహారం అందజేయడానికి రాత్రి 11 గంటల వరకు సైకిల్ తొక్కుతున్నాడు. తలకు మించిన తండ్రి బాధ్యతను మోస్తున్న చిన్నారి బాలుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు. నిజంగా నువ్వు గొప్ప వ్యక్తివి అవుతావంటూ చాలామంది ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు బాల కార్మికుడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చిన్నారి బాలుడు దేశ రాజధాని ఢిల్లీకి చెందిన పహ్లాద్ షాగా గుర్తించారు.

ట్విట్టర్ ద్వారా వెలుగులోకి వచ్చిన 7 ఏళ్ల బాలుడు తన తండ్రి ప్రమాదానికి గురైన తర్వాత జొమాటో డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాహుల్ మిట్టల్ అనే సామజిక కార్యకర్త తన ట్విట్టర్ లో షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.  ఒక పాఠశాలో చదువుతున్న బాలుడు తాత్కాలికంగా ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారినట్లు తెలిపాడు. ఈ బాలుడు రోజు ఉదయం స్కూల్ కు వెళ్లి చదువుకుంటాడు. తరువాత కుటుంబానికి ఆర్ధికంగా అండగా నిలబడానికి తన తండ్రి చేస్తున్న పనిని చేస్తాడు. ఈ బాలుడు సాయంత్రం 6-11 గంటల వరకు ఫుడ్ డెలివరీ బాయ్ గా నిర్వహిస్తాడు. సైకిల్ మీద తిరుగుతూ కస్టమర్స్ కు ఆహారాన్ని సప్లయి చేస్తాడు. తాను తన తండ్రి ఆరోగ్యం కోలుకునేవరకూ ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తానని చెబుతున్నారు ఈ చిన్నారి బాలుడు. తన తండ్రి నమోదు చేసుకున్న ప్రొఫైల్‌కు యాప్‌లో బుకింగ్‌లు వస్తాయని.. ఇప్పుడు తాను ఆ ఆర్డర్స్ ను డెలివరీ చేసే బాధ్యతను తీసుకుంటానని బాలుడు చెప్పాడు. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో షేర్ చేయబడిన వీడియో కస్టమర్ (రాహుల్), మైనర్ బాలుడి మధ్య సంభాషణ హల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

 

ఈ వీడియో పలువురు నెటిజన్లను ఆకట్టుకుంది. తనతల్లిదండ్రులకు, కుటుంబానికి అండగా నిలబడాలనే తపన ఆ చిన్నారి బాలుడితో చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఆ బాలుడి తండ్రి త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. బాలుడు చదువుపై దృష్టి పెట్టి.. మంచి స్టేజ్ కు చేరుకోవాలంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..