Viral Video: ఇతిహాసాల గురించి గుక్కతిప్పుకోకుండా సమాధానాలు.. శభాష్‌ స్టూడెంట్స్‌ అంటోన్న నెటిజన్లు

|

Jul 26, 2022 | 9:33 PM

Viral Video: రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల గురించి మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. వీటికి సంబంధించిన పుస్తకాలు చదివాం. సినిమాలు కూడా చూశాం. అయితే వీటి గురించి కొన్ని ప్రశ్నలడిగితే మాత్రం చాలామంది తెల్లమొహాలు వేస్తారు..

Viral Video: ఇతిహాసాల గురించి గుక్కతిప్పుకోకుండా సమాధానాలు.. శభాష్‌ స్టూడెంట్స్‌ అంటోన్న నెటిజన్లు
School Boys
Follow us on

Viral Video: రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల గురించి మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. వీటికి సంబంధించిన పుస్తకాలు చదివాం. సినిమాలు కూడా చూశాం. అయితే వీటి గురించి కొన్ని ప్రశ్నలడిగితే మాత్రం సమాధానాలు చెప్పలేక చాలామంది తెల్లమొహాలు వేస్తారు. ఈక్రమంలో ఇద్దరు స్కూల్‌ విద్యార్థులు మాత్రం భారత ఇతిహాసాల గురించి గుక్కతిప్పుకోకుండా సమాధానలిస్తున్నారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ టకటకామంటూ ఆన్సర్స్‌ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈక్రమంలో వీరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ స్కూల్‌ పిల్లలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బ్యోమకేశ్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి స్కూల్‌ యూనిఫాంలో ఉన్న ఇద్దరు విద్యార్థులను రామాయణం, మహాభారతాలకు సంబంధించిన కఠినమైన ప్రశ్నలు అడుగుతాడు. దీంతో వారిద్దరూ ఏ మాత్రం తడబడకుండా సమాధానాలిస్తారు. ద్రోణాచార్యుని కుమారుడు, పాండవ సోదరులు, అర్జునుడి గురువు ఇలా మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ ఒక్క క్షణం ఆగకుండా సమాధానాలు చెబుతాడు ఓ విద్యార్థి. అలాగే మరో విద్యార్థి రామాయణం గురించి ప్రశ్నలకు ఏ మాత్రం తడబడకుండా జవాబులిస్తాడు. ‘ఇది స్కూల్‌ అంటే.. మీ పిల్లలను ఇక్కడే చేర్పించండి’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ పిల్లల ప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే స్కూల్‌ పిల్లలను ఇంత బాగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..