Viral Video: తమకు అవకాశాలు రాలేదని కొందరు.. వచ్చిన అవకాశాలు నచ్చలేదని ఇంకొందరు ఏ పని చేయకుండా నిరాశతో ఖాళీగా జీవితాన్ని గడిపేసేవారికి స్ఫూర్తి వంతమైన వ్యక్తులను గురించి పరిచయం చేయాలి. ఎందుకంటే తాము జీవిస్తూ.. తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కొంతమంది పడుతున్న తపన శ్రమ తెలిస్తే.. ఇంకొందరికి స్ఫూర్తిగా నిలుస్తాయి. స్ట్రీట్ ఫుడ్(Street Food) ను చాలామంది ఇష్టపడతారు. ఈ స్ట్రీట్ ఫుడ్ లో అనేక రకాలైన నోరూరించే ఎంపికలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి భేల్ పూరీ(Bhel Puri). దీనిని చాలా మంది ఆహారప్రియులు ఇష్టంగా తింటారు. చిరుతిండి సాధారణంగా ప్రతిచోటా అందుబాటులో ఉంటుంది. చాలామంది చిరుతిళ్ళకు వీధిలో తిరుగుతూ విక్రయిస్తారు. గత 25 ఏళ్లుగా భేల్ పూరీని విక్రయిస్తున్న వ్యక్తికి చెందిన వీడియో ఒకటి ఒక ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. అంతేకాదుఈ వీడియోకు పంజాబీ నటి సోనమ్ బజ్వా కూడా వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళ్తే..
మహేందర్ అనే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి వీడియోను ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని గంటల క్రితం అప్‌లోడ్ చేసారు. ఈ వీడియో ఇప్పటికే 67,000 కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ మహేందర్ గత 25 ఏళ్లుగా భేల్ పూరీని విక్రయిస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. 50 కిలోల బరువున్న ఓ స్టాల్‌ని తలపై పెట్టుకుని దక్షిణ ఢిల్లీ మీదుగా ప్రతిరోజూ 20 కి.మీ నడిచి వస్తాడని వీడియో పేర్కొంది. తన జీవనోపాధి కోసం, కుటుంబ పోషణ కోసం చాలా కష్టపడుతున్నారని తెలిపింది.
ఈ వీడియోలో మహేందర్ తన తలపై కుప్పగా అమర్చిన కంటైనర్లను చక్కగా పెట్టుకుని.. ఎటువంటి తొణుకు లేకుండా చకచకా నడుస్తున్నాడు. ఈ పోస్ట్‌పై నటి సోనమ్ బజ్వా స్పందిస్తూ.. రెండు హార్ట్ ఎమోజీలతో తన ఫీలింగ్ ను చెప్పకనే చెప్పాసింది.
హ్యాట్స్ ఆఫ్ సంపాదించడానికి.. ఆటను చేస్తున్న ప్రయత్నం.. అతను పడుతున్న కష్టం మాటల్లో చెప్పలేనిది అని ఇక నెటిజన్ వ్యాఖ్యానించగా.. ఇలాంటి శ్రమపడి వ్యక్తులు ఈ తరానికి చాలా అవసరం అని మరొకరు వ్యాఖ్యానించారు.
Also Read: