Viral Video : ఏ జంతువునైనా సజీవంగా మింగగల శక్తి పైథాన్‌కి ఉంటుంది. చాలా సార్లు మానవులు కూడా ఈ జీవికి ఆహారం అవుతారు. ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోలో చెట్టుపై ఉన్న ఒక కొండచిలువ నక్కని సజీవంగా మింగడానికి ప్రయత్నిస్తోంది. వీడియోలో మీరు ఒక కొండచిలువ చెట్టుపై వేలాడుతుండటం గమనించవచ్చు. అది జంతువును పట్టుకుని ఉండటం కూడా చూడవచ్చు. ఈ జంతువు నక్కలా కనిపిస్తుంది. కొండచిలువ నక్క శరీరం మొత్తాన్ని విరిచేస్తుంది.
అంతేకాదు ఏకంగా దానిని మింగడానికి ప్రయత్నిస్తోంది. నక్క డ్రాగన్ బారి నుంచి బయటపడటానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు. కానీ పైథాన్ దానిని గట్టిగా పట్టుకుని చుట్టుకుని ఉంది. పైథాన్ ఒత్తిడికి నక్క చనిపోతుంది. చెట్టు నుంచి వేలాడుతూ కొండచిలువ నక్కను సగానికి మింగేస్తుంది. పూర్తిగా మింగుతుందా లేదా అనేది పూర్తిగా తెలియకపోయినా నక్కని మొత్తం మింగే శక్తి మాత్రం దానికి ఉందని జంతు నిపుణులు చెబుతున్నారు. డార్క్ సైడ్ ఆఫ్ నేచర్ అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఈ షాకింగ్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 193K వ్యూస్ వచ్చాయి. అయితే దీనిని 600 మంది రీ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు 2,700 మంది లైక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మరింత వైరల్ అవుతోంది.
— The Dark Side Of Nature (@darksidenatures) July 23, 2021