
పోలాండ్‌లోని గ్రోజిక్ అడవిలో ప్రారంభమైన నిధి వేట ఇప్పుడు ఏ దశకు చేరుకుందంటే అది దేశంలోని అత్యంత ఆశ్చర్యకరమైన పురావస్తు ఆవిష్కరణలలో ఒకటిగా నిలిచింది. వాస్తవానికి డానార్ కాలిష్ అనే కొంతమంది చరిత్ర ప్రేమికులు జూన్ నెలలో కాలిష్ నగరానికి సమీపంలో ఉన్న ఈ అడవిలో వినోదం, అభిరుచి కోసం వేట ప్రారంభించారు. ఈ అన్వేషణలో ఐదు వారాల తర్వాత శతాబ్దాల నాటి నిధి బయటపడి.. ఆ అన్వేషణకి అద్భుతమైన ఆవిష్కరణగా మారింది. ఇప్పుడు ఈ నిథి ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ అన్వేషణలో మొదటగా వారు రోమన్ కాలం నాటి పురాతన స్మశానవాటికను కనుగొన్నారు. సమాధిలో ఒక యోధుడి అస్థిపంజరం, అతని ఈటె, ఒక కవచం భాగాలు ఉన్నాయి. ఈ అవశేషాలు ఆ కాలపు యుద్ధ నైపుణ్యాలు, సంప్రదాయాలకు సాక్ష్యంగా నిలిచాయి. కొన్ని రోజుల తరువాత ఆ బృందం 11వ శతాబ్దానికి చెందిన ఒక నాణెం, ఒక చిన్న మట్టి కుండను కనుగొంది.
మట్టి కుండలో ఏమి ఉందంటే..?
ఆ మట్టి కుండని కాలిస్జ్ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి తెరిచినప్పుడు.. అందులో 631 నాణేలు కనిపించాయి. ఇది పరిశోధకులకు ఆశ్చర్యం కలిగించింది.. ఎందుకంటే ఒక్క నాణెం కూడా పెద్ద నిధికి కీలకం అని వారు గ్రహించారు.
దీని తరువాత నెలాఖరు నాటికి.. వారు మరొక మట్టి కుండను కనుగొన్నారు. అందులో మరిన్ని నాణేలు ఉన్నట్లు గుర్తించారు. అయితే నిజమైన సంచలనాత్మక ఆవిష్కరణ జూలై 12న జరిగింది. బృంద సభ్యుడు మత్యుష మట్టిలో ఏదో మెరుస్తున్నట్లు చూశాడు. దానిని చూసిన తర్వాత.. మొదట అది ఒక సాధారణ బ్రాస్లెట్ అని భావించి, దానిని మట్టి నుంచి బయటకు తీశాడు.
ఒక సాధారణ ఆవిష్కరణ ప్రత్యేకమైనదిగా మారుతుంది
దీని తరువాత నిపుణులు దానిని పరిశీలించినప్పుడు.. అది వాస్తవానికి ఐదవ శతాబ్దానికి చెందిన స్వచ్ఛమైన బంగారు హారమని వారు కనుగొన్నారు. 222 గ్రాముల బరువున్న ఈ హారాన్ని హుక్-అండ్-లూప్ డిజైన్‌లో తయారు చేశారు. ఆశ్చర్యకరంగా దాని డిజైన్ ఎక్కడా చెక్కు చెదర లేదు. ఈ హారం భద్రత కోసం.. దానిని మడిచి జాగ్రత్తగా ఒక మట్టి కుండలో ఉంచారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నక్లెస్ గోతిక్ ప్రజలకు చెందినది. ఆ సమయంలో పోలాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో స్లావిక్ ప్రజలతో పాటు నివసించిన జర్మన్ సమాజం ఇది. స్కాండినేవియాలో గోతిక్ నెక్లెస్‌లు ఇంతకు ముందు కనుగొనబడ్డాయి. అయితే పోలాండ్‌లో ఇటువంటి ఆవిష్కరణ జరగడం ఇదే మొదటిసారి. అందుకే ఇది ఇప్పుడు ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆవిష్కరణలన్నీ కలిసి ఈ ప్రాంతం ప్రాచీన చరిత్రకి స్పష్టమైన చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాయి. గ్రోజిక్ అడవి కథ కొన్నిసార్లు ఒక సాధారణ అన్వేషణ యాత్ర కూడా మనల్ని గతంలోని అమూల్యమైన వారసత్వాలను తెలిసేలా చేస్తుందని ఇది రుజువు చేస్తుందని అంటున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..