Peacock vs Cobra: 100 అడుగుల లోతున్న బావిలో నెమలి, తాచుపాము మధ్య బీకర ఫైట్

జాతీయ పక్షి నెమలి, నల్లటి నాగుపాము మధ్య 100 లోతు ఉన్న బావిలో భీకర పోరు జరిగింది. వాటిని గమనించిన స్థానికులు.. రక్షించాలని నిర్ణయించారు. ముఖేశ్ అనే స్నేక్ క్యాచర్ తాళ్ల సాయంతో బావిలోకి దిగి.. ముందుగా పామును, తర్వాత నెమలిని బయటకు తీసుకొచ్చాడు.

Peacock vs Cobra: 100 అడుగుల లోతున్న బావిలో నెమలి, తాచుపాము మధ్య బీకర ఫైట్
Cobra Vs Peacock

Updated on: Apr 11, 2025 | 6:33 PM

అదో 100 అడుగులు ఉన్న వ్యవసాయం బావి. ఎండాకాలం కావడంతో నీళ్లన్నీ ఎండిపోయాయి. ఆ బావిలో ఓ బ్లాక్ కోబ్రా చిక్కుకుపోయింది. నీటి కోసం వెళ్లిందో.. దారి తప్పిందో తెలియదు కానీ.. ఓ నెమలి కూడా ఆ బావిలో పడింది. దీంతో ముందు నుయ్యు.. వెనుక గొయ్యిగా మారింది వాటి పరిస్థితి. ప్రాణాలు నిలుపుకునేందుకు రెండు జీవులు విపరీతంగా పోట్లాడాయి. కాటు వేసి నెమలి ఉసురు తీయాలని పాము.. ముక్కుతో గాయపరిచి పామును మట్టుబెట్టాలని నెమలి విజృంభించాయి. వాటి పోరాటాన్ని స్థానికులు గమనించారు. ఆ ప్రాంతంలో కోబ్రా మ్యాన్ అని పిలిచే స్నేక్ క్యాచర్ ముఖేష్ మాలికి సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన ముఖేష్.. పామును, నెమలిని రెస్క్యూ చేయాలని డిసైడయ్యాడు. తాళ్ల సాయంతో  100 అడుగుల లోతున్న ఆ బావిలోకి దిగి ముందుగా పామును తర్వాత నెమలిని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చాడు. తీవ్ర దప్పికతో ఉన్న నెమలికి నీరు పట్టించిన స్థానికులు.. ఆ రెండు జీవులను అటవీ సిబ్బందికి అప్పగించారు.  రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.