ప్రస్తుతం మనదేశంలోని సినిమా సాంగ్స్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్, టాలీవుడ్ అని ఏ భాషలోనైనా బీట్ బాగుటుంటే చాలు.. స్టెప్స్ వేయడానికి అంటున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో బాలీవుడ్ చిత్రాలు.. హిందీ పాటల క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా బాలీవుడ్ సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఒక జంట 2006 చిత్రం ఓంకార్లో ని ‘బిడి జలై లే ‘ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది . ఈ జంట డ్యాన్స్ ను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 30 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోను పెళ్లి వేడుకలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ‘ఓంకార’ చిత్రంలోని ‘బిడి జలై లే…’ పాటపై ఓ వృద్ధ దంపతులు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అయితే భర్త కూడా తన భార్యకు జత కలిశారు. ఆమె చేస్తున్న డ్యాన్స్ ను అనుసరిస్తూ.. తనదైన స్టెప్స్ వేశారు. ఈ దంపతులు వివాహ వేడుకక్కి వచ్చిన కుటుంబ సభ్యులు, అతిథుల హృదయాలను గెలుచుకున్నారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఇద్దరి కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వీడియోను చూడాల్సిందే. నెటిజన్లు ఈ వీడియోను ఎంతగానో ఇష్టపడుతున్నారు.. మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ పాటను సునిధి చౌహాన్, సుఖ్విందర్ సింగ్ పాడారు
పాకిస్థానీ జంట ఈ డ్యాన్స్ వీడియోను Instagram లో thebilalijaz అనే ఖాతాతో షేర్ చేసారు. క్యాప్షన్‌లో ‘ఎంత మంచి అవగాహన’ ఇద్దరూ డ్యాన్స్ ఫ్లోర్‌లో దుమ్ము దులిపారు. నెల రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..