Watch Video: ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. అదనంగా పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ

|

May 26, 2024 | 9:44 PM

ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా వ్యక్తం చేశారు. అన్ని ఆహారపదార్థాలలో సూక్ష్మజీవులు సర్వసాధారణం. కూరగాయలలో కూడా అలాంటి చిన్నపాటి బ్యాక్టీరియా ఉంటుందని ఒకరు వ్యాఖ్యనించగా, ఇకపై నూడుల్స్‌న్ని కూడా నీళ్లలో బాగా కడిగి ఉడికించి తినండి అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.

Watch Video: ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. అదనంగా పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
Instant Noodles
Follow us on

సరసమైన ధరలో కడుపు నింపుకునేందుకు, నిమిషాల్లో ఫుడ్‌ రెడీ కావాలనుకునే ప్రతి ఒక్కరికీ మ్యాగీ నూడుల్స్ ఎంతో ఇష్టమైనది. అయితే ఇప్పుడు వైరల్‌గా మారిన వీడియో చూశాక ఇక నుంచి మ్యాగీ నూడుల్స్‌ తినాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవును, వైరల్ వీడియోలో మ్యాగీని మైక్రోస్కోప్‌లో చూస్తున్నారు. అందులో కనిపించిన సీన్‌ చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. నూడుల్స్‌లో అనేక సూక్ష్మజీవులు సంచారం చేయటం కనిపించింది.

ఈ వీడియో మే 22న @cooltechtipz అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. షేర్ చేసిన నాలుగు రోజుల్లోనే ఈ వీడియో 3.2 మిలియన్లు లేదా 30 లక్షలకు పైగా వీక్షణలను అందుకుంది. అంతేకాదు ఈ వీడియోను 14 వేల మందికి పైగా మెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా వ్యక్తం చేశారు. అన్ని ఆహారపదార్థాలలో సూక్ష్మజీవులు సర్వసాధారణం. కూరగాయలలో కూడా అలాంటి చిన్నపాటి బ్యాక్టీరియా ఉంటుందని ఒకరు వ్యాఖ్యనించగా, ఇకపై నూడుల్స్‌న్ని కూడా నీళ్లలో బాగా కడిగి ఉడికించి తినండి అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి