Viral Video: దేవుడు ఉన్నాడు.. ఇదిగో సాక్ష్యం! పాక్‌లో విద్యుత్‌ వ్యవస్థ ఎలా ఉందో చూస్తే షాక్‌ అవుతారు..

పాకిస్తాన్ నుండి వచ్చిన ఒక వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక విద్యుత్ స్తంభం ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా కనిపిస్తుంది. కానీ, అది ఒక రకమైన జుగాడ్‌కు ఉదాహరణగా మారింది. ముందుగా గవీడియో చూసిన వారికి అది ఒక వినోదభరితంగా అనిపిస్తుంది. కానీ, కొన్ని సెకన్ల తర్వాత వణికిపోయేంత భయం పుడుతుంది.

Viral Video: దేవుడు ఉన్నాడు.. ఇదిగో సాక్ష్యం! పాక్‌లో విద్యుత్‌ వ్యవస్థ ఎలా ఉందో చూస్తే షాక్‌ అవుతారు..
Pakistani Pole

Updated on: Jan 26, 2026 | 6:31 PM

సోషల్ మీడియాలో ఎన్నో వింతలు, విశేషాలకు అతి పెద్ద ప్లాట్‌ఫామ్‌.. ఇక్కడ ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్నిసార్లు అవి మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. కొన్నిసార్లు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని సార్లు ఆశ్చర్యం, షాక్‌ అయ్యేలా కూడా చేస్తాయి. పాకిస్తాన్ నుండి వచ్చిన ఒక వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక విద్యుత్ స్తంభం ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా కనిపిస్తుంది. కానీ, అది ఒక రకమైన జుగాడ్‌కు ఉదాహరణగా మారింది. ముందుగా గవీడియో చూసిన వారికి అది ఒక వినోదభరితంగా అనిపిస్తుంది. కానీ, కొన్ని సెకన్ల తర్వాత ఒక వింత భయం పుడుతుంది. కారణం స్తంభం నుండి వేలాడుతున్న లెక్కలేనన్ని విద్యుత్ మీటర్లు, బయటకు పడిపోయిన వైర్లు, కింద పారుతున్న నీళ్లు చూస్తే..

ఈ వీడియోలో కనిపించిన స్తంభం రోడ్డు పక్కనే ఉంది. ఇది అనేక విద్యుత్ మీటర్లు, వైర్లకు అనుసంధానించబడి ఉంది. ఇది ప్రమాదకరమైన పజిల్ లాగా ఉంది. వైర్లు చాలా చిక్కుకుపోయాయి. ఏ కనెక్షన్ ఎక్కడికి వెళుతుందో గుర్తించడం కష్టం. ఇక ఆ స్తంభం చుట్టూరా నీళ్లు చేరాయి. మొత్తం విద్యుత్ వ్యవస్థ ఆ నీటి మధ్యలో నిలబడి ఉంది. వీడియో చూస్తున్న ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుంది..? చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందా భయాందోళనకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

కానీ, ఈ వీడియో నిర్మాత మాత్రం నవ్వుతూ వెటకారంగా బ్రిటిష్ వారు ఈ స్తంభాన్ని చూస్తే వారు కూడా దేవుడిని నమ్మడం మొదలు పెడతారు..ఈ ప్రపంచం మొత్తం దేవుడి దయతోనే నడుస్తుందని ఖచ్చితంగా అంగీకరిస్తారని అన్నారు. ఈ సింగిల్ లైన్ సోషల్ మీడియాలో వైరల్ కోట్ అయింది. ప్రజలు దీనిపై విపరీతంగా మీమ్స్ తయారు చేస్తున్నారు. చాలా మంది దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. మరికొందరు దీనిని వ్యవస్థ అతిపెద్ద వైఫల్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు ఇది స్తంభం కాదని, జుగాడ్‌ చేసిన అద్భుతం అని రాశారు. మరొకరు ఎలక్ట్రీషియన్ కూడా దీనిని చూసి షాక్ అవుతారని అన్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా popartbutt143 ద్వారా షేర్ చేయబడింది. ఇది వేగంగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..