Viral Video: మనుషులే కాదు.. కోతి కూడా రీల్స్‌కు అడిక్ట్.. నెట్టింట్లో వీడియో వైరల్..

|

Aug 14, 2023 | 2:12 PM

స్మార్ట్‌ఫోన్‌ల క్రేజ్ ప్రతి ఒక్కరినీ తలకిందులు చేస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు. అయితే మనుషులం మాత్రమే స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారని అనుకుంటే.. అది పూర్తిగా తప్పే.. ఎందుకంటే జంతువులు కూడా స్మార్ట్ ఫోన్ వ్యామోహానికి దాసులే.

Viral Video: మనుషులే కాదు.. కోతి కూడా రీల్స్‌కు అడిక్ట్.. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral Video
Follow us on

ఇంటర్నెట్ ప్రపంచంలో జంతువుల వీడియోలకు భిన్నమైన క్రేజ్ ఉంది. కొన్ని వీడియోలు మనసుకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలపై కంట పడితే చాలు.. ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. అలాంటి వీడియోలను వెంటనే ఫోన్, డెస్క్‌టాప్‌లో సేవ్ చేస్తారు.  తద్వారా అవి తర్వాత సౌకర్యవంతంగా కనిపిస్తాయి. ఇలాంటి వీడియో ఈ రోజుల్లో జనాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

స్మార్ట్‌ఫోన్‌ల క్రేజ్ ప్రతి ఒక్కరినీ తలకిందులు చేస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు. అయితే మనుషులం మాత్రమే స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారని అనుకుంటే.. అది పూర్తిగా తప్పే.. ఎందుకంటే జంతువులు కూడా స్మార్ట్ ఫోన్ వ్యామోహానికి దాసులే. జంతువుల్లో కోతులు మనుషులను అనుసరిస్తూ త్వరగా అనేక విషయాలు నేర్చుకుంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక క్లిప్ తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో కోతులు మానవులమైన మన నుండి మొబైల్ స్క్రోలింగ్ కళను కూడా నేర్చుకున్నది. ఒక కోతి హాయిగా ఫోన్‌ను ఉపయోగిస్తూ ప్రావీణ్యం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో ఒక కోతి మంచంపై హాయిగా పడుకుని, మనుషుల మాదిరిగా రీల్స్‌ను స్క్రోలింగ్ చేస్తూ కనిపించడం మీరు చూడవచ్చు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు.. ఇది చూస్తే కోతులు నిజంగా మన పూర్వీకులే అని అర్థమైంది. మరికొందరు టచ్‌స్క్రీన్ ఎలా పనిచేస్తుందో తమకు తెలిసినట్లుగా ఉందని రాశారు. అంతేకాదు అనేక మంది దీనిపై తమ భిన్నమైన అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..