మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి.. భావోద్వేగానికి గురిచేస్తోన్న వీడియో

కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే మనిషిలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదు.. కొంతమంది హృదయాల్లో బతికే ఉంది అనిపిస్తుంది. ఒక్క చిన్న పని కొన్ని వేల కోట్ల మంది హృదయాలను గెలుచుకుంటుంది. అటువంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన తర్వాత నేటికీ మానవత్వం సజీవంగా కొంతమంది రూపంలో బతికే ఉందని.. ఇంకా ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారని సంతోష పడతాము.

మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి.. భావోద్వేగానికి గురిచేస్తోన్న వీడియో
Viral Video

Updated on: Oct 05, 2025 | 1:26 PM

నగరంలోని రద్దీగా ఉండే వీధులు, సందుల గుండా నడుస్తూ.. తమను తాము, తమ కుటుంబాలను పోషించుకోవడానికి పగలు, రాత్రి శ్రమించే వ్యక్తులను మనం తరచుగా చూస్తూ ఉంటాం. రోడ్డు పక్కన చిన్న స్టాల్ ఏర్పాటు చేసినా, రోడ్డు పక్కన నిలబడి వస్తువులను అమ్మినా.. ఇలా చిన్న పని చేసినా.. కొంత మంది జీవితాలు ఎల్లప్పుడూ పోరాటాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు పెన్నులు, చిన్న చిన్న వస్తువులు పట్టుకుని అమ్మడం చూస్తుంటే మనసు బాధపడుతుంది. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత విశ్రాంతి అవసరమైన సమయంలో .. కూడా పరిస్థితులకు తలవొంచి.. శరీరం సహకరించక పోయినా.. అలసట ఉన్నా.. లెక్క చేయకుండా ఉపాధి కోసం తెల్లవారుజామునే బయలుదేరవలసి వస్తుంది. అటువంటి వారి దుస్థితి చూస్తే ఎవరికైనా గుండె కరగవచ్చు. పాత బట్టలు, భుజాలపై బాధ్యతల భారం, ఆకలి.. ఇవన్నీ వారికి సహచరులవుతాయి. ప్రతి ఉదయం జీవనోపాధి కోసం కొంచెం ఎక్కువ సంపాదించాలనే ఆశతో మేల్కొంటారు.

మానవత్వం ఇంకా బతికే ఉంది

అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఇందులో ఒక వృద్ధురాలు రెండు తూనికల యంత్రాలతో రోడ్డు పక్కన కూర్చుని ఉన్నట్లు చూపిస్తుంది. వర్షం పడుతోంది. నేల అంతా తడిగా ఉంది. గొడుగు కింద కూర్చుని.. ఎవరైనా వచ్చి యంత్రంలో తన బరువును తూచుకుంటారని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. బహుశా ఇదే ఆమెకు ఏకైక ఆదాయ వనరు కావచ్చు.

ఇవి కూడా చదవండి

ఎంత సేపు వేచి చూసినా.. ఒక్క కస్టమర్ కూడా రాకపోయేసరికి.. ఆమె ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తల వంచి విచారంగా కూర్చుంది. అకస్మాత్తుగా.. ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వెళ్లి యంత్రంపై నిలుచుని తన బరువును కొలలుచుకున్నాడు. ఆ సమయంలో ఆ బామ్మ ముఖంలోకి వెలుగు తిరిగి వచ్చింది. కనీసం తనకు కొంచెం అయినా డబ్బు వస్తుందనే ఆశ.. ఆమె కళ్ళలో ఒక మెరుపు వచ్చింది.

దేవదూత అయిన కస్టమర్

బరువు కొలతకు ఎంత చెల్లించాల్సి ఉంటుందని ఆ వ్యక్తి ఆమెను అడిగినప్పుడు.. అమ్మమ్మ నిశ్శబ్దంగా ఐదు రూపాయలు చెప్పింది. అయితే ఆ వ్యక్తి కేవలం కస్టమర్ మాత్రమే కాదని.. తనకు దేవదూత అని అమ్మమ్మకు తెలియదు. ఆ వ్యక్తి ఆమెకు కొంత డబ్బు ఇచ్చి, “ఇవి తీసుకో” అని అన్నాడు. మొదట ఆ బామ్మ ఆశ్చర్యపోయింది.. తరువాత సంకోచంగా ఆ నోట్ తీసుకొని చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆమె కళ్ళు కృతజ్ఞతతో ప్రకాశించాయి. తరువాత ఆ వ్యక్తి ఆమెకు చీరను కూడా బహుమతిగా ఇచ్చాడు. ఇంకా అతను కూర్చుని ఆమెతో టీ కూడా తాగాడు.

వీడియో చివర్లో ఆ వ్యక్తి అమ్మమ్మను ప్రేమగా కౌగిలించుకుని.. ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుని, ఆమెకు వీడ్కోలు పలికాడు. అమ్మమ్మ కూడా అతనిపై తన ప్రేమని.. ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఈ దృశ్యం చాలా నిజాయితీగా,భావోద్వేగంగా ఉంది. దీన్ని చూసిన ఎవరైనా కదిలిపోతారు.

ఇన్‌స్టాలో షేర్ చేయబడింది

ఈ వీడియోను @iamhussainmansuri అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు. ప్రజలు దీనిని విపరీతంగా ఇష్టపడుతున్నారు. దీనిని ఇప్పటివరకు మూడు మిలియన్లకు పైగా వీక్షించారు. నిరంతరం స్పందనలు వస్తున్నాయి. మానవత్వం ఇంకా బతికే ఉందని.. మనిషికి కావలసిందల్లా ఒకరికొకరు సహాయం చేసుకోవడమేనని ప్రజలు రాస్తున్నారు.

వీడియోను ఇక్కడ చూడండి

నిజానికి, ఈ వీడియో కేవలం ఒక వృద్ధ మహిళ కథ మాత్రమే కాదు.. మన సమాజ వాస్తవికతను కూడా వెల్లడిస్తుంది. వయసు పైబడినప్పటికీ మనుగడ కోసం పోరాడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ, వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు ఉన్నారు. దయ, కరుణ ఇప్పటికీ మనిషి హృదయాలలో మిగిలే ఉందని నిరూపిస్తున్నారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..