Viral Video: బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా హవా మాములుగా లేదుగా.. మరో వధువు స్టెప్పులు అదుర్స్..

|

Aug 29, 2021 | 9:08 PM

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగు డుగు డుగు డుగు డుగు డుగని... ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే మార్మోగుతోంది. అటు పెళ్లిళ్లు,

Viral Video: బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా హవా మాములుగా లేదుగా.. మరో వధువు స్టెప్పులు అదుర్స్..
Viral Video
Follow us on

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగు డుగు డుగు డుగు డుగు డుగని… ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే మార్మోగుతోంది. అటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బుల్లెట్ పాట మోత మోగిస్తోంది. అంతేకాదు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, జోష్, మోజ్, టకాటక్, ఎంఎక్స్ వంటి షార్ట్ వీడియో అప్లికేషన్స్‌లోనూ దుమ్ము రేపుతోంది. లక్షలాది మంది ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇక యూబ్యూట్‌లోనూ బుల్లెట్ పాట రికార్డులు సృష్టిస్తోంది. కోట్లాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. నిజానికి ఈ పాట వచ్చి చాలా రోజులు అవుతుంది. కేవలం ఇన్‏స్టా రీల్స్‏లో ట్రెండింగ్‏లో ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు పెళ్లి బరాత్‏లో రచ్చ చేస్తోంది. ఇటీవల ఓ పెళ్లి కూతురు తన పెళ్లి బరాత్‏లో ఈపాటకు డ్యాన్స్ చేయడంతో ఈ పాటకు క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఒక్క డ్యాన్సుతో ఆ పెళ్లికూతురు ఫేమస్ అయ్యింది. ఆమె స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆ వధువుకు సాంగ్ నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాటకు వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ స్టెప్పులేస్తున్నారు.

తాజాగా ఈ పాటకు మరో నవ వధువు స్టెప్పులెసింది. ప్రకాశంజిల్లా కోమరోలు మండలం కురాకువారి పల్లెలో పెళ్లి కూతురు బుల్లెట్‌ బండి పాటకు డ్యాన్స్‌ చేసి అందరిని ఆకట్టుకుంది. పెళ్లి కూతురు తన స్లైలో స్టెప్పులెస్తూ కిరాక్ పుట్టించింది. ఆర్మీలో పనిచేస్తున్న శ్రీకాంత్‌ను తేజశ్రీ అనే అమ్మాయి ఈనెల 27వ తేదిన వివాహం చేసుకుంది. ఈ సందర్బంగా పెళ్ళి కూతురు తేజశ్రీ బుల్లెట్‌ బండి పాటకు పెళ్ళికొడుకు ముందు స్టెప్పులేయడంతో బంధువులు చప్పట్లతో ఎంకరేజ్‌ చేశారు… ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: స్టార్ హీరోకు ఝలక్ ఇచ్చిన దొంగలు.. సినిమా స్టైల్లో కారు చోరి.. టెక్నాలజీని వాడడంలో వీళ్లు వీరలెవల్..

Oliviak Morris: హైదరాబాద్ పానీ పూరికి ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఫిదా.. వీధుల్లో సందడి చేసిన హాలీవుడ్ హీరోయిన్..