Viral Video: ఏమిరా బాలరాజు.. ఏమిరా ఆ సంబరం…ముంబై వర్ష బీభత్సంలో ‘ఆరా ఫార్మింగ్’ డ్యాన్స్‌తో ఎంజాయ్‌

ముంబైలో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. నగర రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఎక్కడికక్కడా జనజీవనం స్థంభించింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నడుములోతు నీళ్లు వచ్చి చేరాయి. అయినా ముంబై వాసుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఇంతలో ఒక వీడియో సోషల్ మీడియాలో...

Viral Video: ఏమిరా బాలరాజు.. ఏమిరా ఆ సంబరం...ముంబై వర్ష బీభత్సంలో ఆరా ఫార్మింగ్ డ్యాన్స్‌తో ఎంజాయ్‌
Aura Farming Dance On Mumba

Updated on: Aug 20, 2025 | 5:45 PM

ముంబైలో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. నగర రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఎక్కడికక్కడా జనజీవనం స్థంభించింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నడుములోతు నీళ్లు వచ్చి చేరాయి. అయినా ముంబై వాసుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఇంతలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఒక వ్యక్తి నీటితో నిండిన డివైడర్‌పై నిలబడి ‘ఆరా ఫార్మింగ్’ నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ వైరల్ వీడియో ముంబయి శివారులో రికార్డ్‌ అయినట్లు తెలుస్తోంది. వర్షపు నీటితో నిండిన రోడ్డు డివైడర్‌పై ఒక వ్యక్తి హాయిగా నిలబడి ఉన్నట్లు మీరు చూడవచ్చు. దీని తర్వాత, అతను ‘ఆరా ఫార్మింగ్ నృత్యం’ చేస్తూ నీటిలోకి దూకుతాడు.

ఆరా ఫార్మింగ్ నృత్యం అంటే దీనిని ‘బోట్ నృత్యం’ అని కూడా పిలుస్తారు. ఇటీవల దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని రాత్రికి రాత్రే ఇంటర్నెట్‌ సంచలనంగా మార్చింది. 11 ఏళ్ల ఇండోనేషియా బాలుడు ర్యాన్ అర్కాన్ ప్రారంభించాడు.

వీడియో చూడండి:

 

అయితే ముంబైలో ‘ఆరా ఫార్మింగ్ డ్యాన్స్’ జరిగిన మొదటి కేసు ఇది కాదు. గతంలో, కదులుతున్న కారు బానెట్‌పై నిలబడి ఒక మహిళ ఇలాంటి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది, దీనిని ప్రజలు తీవ్రంగా విమర్శించారు.