Snake Rat Fight: సోషల్ మీడియో ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా.. ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి ప్రేమ అనంతమైనది. తల్లికి బిడ్డకంటే ఏదీ ఎక్కువ కాదు. ఇది మానవులతోపాటు, జంతువుల్లో కూడా కనిపిస్తుంది. తల్లి బిడ్డ కోసం ఏదైనా చేస్తుంది.. అవసరమైతే.. ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. పిల్లలకు ఎలాంటి నష్టం కలగకుండా, బాధపడకుండా, ఎవ్వరి నుంచి హాని జరగకుండా ఉండేందుకు తల్లి ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇలా అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో (Viral Video) బాగా వైరల్ అవుతోంది. దీనిలో ఎలుక (Rat) తన బిడ్డను రక్షించడానికి ప్రమాదకరమైన పాము (Snake)తో పోరాడుతుంది.
ఎలుక పిల్లని నోట్లో పెట్టుకుని పాము పరుగెత్తుతుండగా.. దానిని కాపాడేందుకు ఎలుక అడ్డుకుంటున్న సన్నివేశాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. ఎలుక పాము తోకను పట్టుకొని గట్టిగా కొరికేస్తుంది. దీంతో పాము ఎలుక బిడ్డను విడిచిపెడుతుంది. మొదట పాము ఎలుక పిల్లను వదలదు. ఈ క్రమంలో ఎలుక భీకరంగా దాడిచేస్మతుంది. దీంతో పాము ఎలుక పిల్లను విడిచిపెడుతుంది. ఆ తర్వాత కూడా ఎలుకకు కోపం తగ్గలేదు. అది పాము వెంట పడి చాలా దూరం వరకు తరిమికొడుతుంది. ఆ తర్వాత ఎలుక బిడ్డ దగ్గరకు వచ్చి దానికి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
వైరల్ వీడియో
Fight for survival and life is basic instinct every species in #nature #SurvivalOfFittest @ipskabra
Via:@IfsSamrat pic.twitter.com/QcUsgP7eLX
— Surender Mehra IFS (@surenmehra) January 22, 2022
వైరల్ అవుతున్న ఈ వీడియోను IFS అధికారి సురేందర్ మెహ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు ‘అస్తిత్వం, జీవితం కోసం పోరాటం ప్రకృతిలోని ప్రతి జీవి ప్రాథమిక స్వభావం’ అంటూ క్యాప్షన్‌లో రాశారు. దీనిని వేలాదిమంది నెటిజన్లు వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలో తల్లిని మించిన వారుండరని.. తల్లి ప్రేమ అజరామరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: