
అడవి చూడడానికి ఎంత అందంగా కనిపించినా.. అడవి అనేక ప్రమాదాలతో నిండి ఉంటుంది. ప్రతి క్షణం జీవుల మధ్య ఆహారం కోసం పోరాటం జరుగుతుంది. సింహం, చిరుత, పులి వంటి ఎటువంటి జంతువులు అయినా సరే తమ పిల్లల విషయానికి వస్తే.. ఎటువంటి వేటగాడితోనైనా సరే ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడుతుంది. ముఖ్యంగా తల్లి తన ప్రాణాలను పట్టించుకోకుండా తన శక్తికి మించి తన పిల్లలను కాపాడుకోవడానికి పోరాడుతుంది. ఈ రోజుల్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇలాంటిదే కనిపించింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడియోలో ఒక ఆడ చిరుతపులి తన పిల్లలను కాపాడుకోవడానికి సింహంతో పోరాడింది.
తల్లి చిరుతపులి తన చిన్న పిల్లలతో అడవిలో ఉంది. ఈ సమయంలో ఒక సింహం అక్కడికి చేరుకుంది. చిరుత పులి పిల్లలవైపు వెళ్ళాలనుకుంది. అదే సమయంలో చిరుత పులి.. తన పిల్లల్ని సింహం చేరుకునే లోపు తుఫానులా సింహం పైకి దూసుకెళ్లింది. తన పిల్లలను తన వెనుక దాచి పెట్టి.. తన శక్తినంతా ఉపయోగించి సింహాన్ని ఎదుర్కొంది. తన శక్తిని అంతా కూడదీసుకుని తుఫానులా సింహంతో పోరాడింది.
వీడియోను ఇక్కడ చూడండి
ఆడ చిరుత తన పిల్లలను తన వెనుక దాచి తన శక్తినంతా ఉపయోగించి ఆ సింహాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. సింహం శక్తివంతమైనది. అయితే తల్లి చిరుతపులి సింహం కంటే తక్కువ ఏమీ కాదు. తన పిల్లల వైపు వస్తున్న సింహాన్ని తన పదునైన గోళ్లతో, మెరుపులా సింహంపై దాడి చేసింది. రెండింటి మధ్య భీకర పోరాటం జరిగింది. సింహం తనపైకి దూసుకొచ్చిన ప్రతిసారీ.. ఎక్కడా తగ్గకుండా చిరుత దాడి చేసింది. ఈ దాడి దాదాపు 15-20 సెకన్ల పాటు చాలా ప్రమాదకరమైన రీతిలో సాగింది. సింహం .. చిరుత అడ్డు తొలగించి పిల్లలను చేరుకోవడానికి పదే పదే ప్రయత్నించింది. అయితే తల్లి ధైర్యంగా సింహం దారిలో గోడలా నిలిచింది. చిరుతపులి సైజ్ లో చిన్నదిగా ఉండవచ్చు.. అయితే తన పిల్లలను రక్షించుకునే విషయంలో సింహంతో పోరాడే విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
ఈ వీడియోను its_jungle_ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోకి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆడ చిరుత తల్లి ప్రేమని ప్రశంసిస్తున్నారు. సింహం వంటి శక్తివంతమైన ప్రత్యర్థిని ఎక్కువ కాలం ఆపలేమని తల్లి చిరుతకు తెలుసు.. అయినా సరే తన పిల్లలు సురక్షితంగా ఉంచడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడింది. ఇదేకదా తల్లి ప్రేమ అని అంటున్నారు నెటిజన్లు
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..