చోరీ చేస్తే ఆ కిక్కే వేరప్పా!..15 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సర్పంచి చోరకళ..!
15 ఏళ్లుగా ఓ గ్రామ పంచాయితీ సర్పంచ్ వరుస చోరీలు చేస్తూ నాలుగు రాళ్లు వెనుకేసుకోసాగింది. గుట్టుగా సాగిస్తున్న ఈ దందా ఓ మహిళ మెడలో 5 తులాల బంగారు గొలుసు మాయం అవడంతో ఒక్కసారిగా బయటకు వచ్చింది. పోలీసులు సీసీకెమెరీ దృశ్యాలు చెక్ చేయగా.. సర్పంచి మేడం చేతి వాటం చూసి అవాక్కయ్యారు. ఇదేందని ప్రశ్నించగా.. దొంగతనం చేస్తే వచ్చే కిక్కే వేరప్ప.. అంటూ తెగ సిగ్గుపడిపోయింది..

చెన్నై, సెప్టెంబర్ 9: ఆమె ఓ గ్రామానికి సర్పంచి. ఎంతో బాధ్యతగా ఉండవల్సిన సర్పంచి అమ్మగారు.. గ్రామంలో 15 ఏళ్లుగా వరుస చోరీలు చేస్తూ నాలుగు రాళ్లు వెనుకేసుకోసాగింది. గుట్టుగా సాగిస్తున్న ఈ దందా ఓ మహిళ మెడలో 5 తులాల బంగారు గొలుసు మాయం అవడంతో ఒక్కసారిగా బయటకు వచ్చింది. పోలీసులు సీసీకెమెరీ దృశ్యాలు చెక్ చేయగా.. సర్పంచి మేడం చేతి వాటం చూసి అవాక్కయ్యారు. ఇదేందని ప్రశ్నించగా.. దొంగతనం చేస్తే వచ్చే కిక్కే వేరప్ప.. అంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని నరియంబట్టు డీఎంకే పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడుకు చెందిన నరియంబట్టులో వరలక్ష్మి (50) అనే మహిళ ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కాంచీపురం వెళ్లింది. తిరిగి బస్సులో సొంతూరు కోయంబేడుకు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఆమె మెడలోని 5 సవర్ల బంగారు గొలుసు చోరీకి గురైంది. బంగారు గొలుసు, ఉంగరం, గాజు వంటి 5 సవర్ల బంగారు ఆభరణాలు హ్యాండ్ బ్యాగులో ఉంచుకుంది. అయితే ఆమె కోయంబేడులో దిగి తన బ్యాగ్ చెక్ చేయగా.. అవి మాయం అయ్యాయి. దీంతో ఆమె బాధితురాలు కోయంబేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సులోని సీసీకెమెరాను తనిఖీ చేశారు. అందులో బాధిత మహిళ బ్యాగ్‌లోని నగలను ఓ మహిళ చేరీ చేయడం పోలీసులు గమనించారు. అనంతరం నేరుగా తిరుప్పత్తూరు జిల్లా నరియంపట్టు పంచాయతీ సర్పంచి భారతి (డీఎంకే)ని ఆదివారం అరెస్టు చేశారు. ఆమె వద్ద డబ్బు, పలుకుబడి ఉన్నా.. గత 15 ఏళ్లుగా చోరీలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పైగా ఇలా దొంగతనాలు చేయడం వల్ల ఆనందమే వేరని, అందుకే తాను దొంగతనాలు చేస్తున్నానని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అరెస్టయిన భారతిపై వెల్లూరు, తిరుపత్తూరు, వృతంపట్టుతో సహా వివిధ పోలీస్ స్టేషన్లలో దొంగతనం, హత్య బెదిరింపులు సహా 10కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
When you become a member of DMK, you are rewarded with the license to loot.
The person circled in the picture below is a DMK panchayat president in Tirupatthur district who was caught stealing 4 sovereign gold from a passenger in a bus.
From pickpocketing on buses to… pic.twitter.com/4OYIFw7RJU
— K.Annamalai (@annamalai_k) September 6, 2025
అనంతరం పంచాయతీ సర్పంచ్ భారతిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ దొంగతనం ఘటనలో పంచాయతీ సర్పంచ్ భారతి ప్రమేయం ఉందని తేలడంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే అన్నాడీఎంకే నాయకులు, బీజేపీ నాయకులు సహా పలువురు నేతలు దీనిని ఖండిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
