
అడవిలో ఒకే ఒక నియమం ఉంది. అక్కడ బలవంతుడే గెలుస్తాడు. అందుకే బలమైన, ప్రమాదకరమైన జంతువులు తమ ఆధిపత్యాన్ని ఇతర జంతువులకు చూపించి బలహీనమైన వాటిని సులభంగా తమ ఆహారంగా చేసుకుంటాయి. అటువంటి పరిస్థితిలో చిన్న జంతువులు తమను తాము రక్షించుకోవడానికి జీవించి ఉండడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అయితే చాలాసార్లు ఏదో ఒక జీవి అకస్మాత్తుగా వచ్చి చిన్నచిన్న జంతువులను వేటాడం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఒక పక్షి తన పిల్లల్ని పాము నుంచి కాపాడుకునేందుకు చేసిన పోరాటం కనిపించింది.
వీడియోలో ఒక పాము పక్షి గూటిలోకి ప్రవేశించి అందులో ఉన్న పక్షి గుడ్లను తినాలని ప్రయత్నం చేస్తుంది.. అక్కడికి వచ్చిన తల్లి పక్షికి పాము చేస్తున్న పని అర్ధం అయింది. తన పిల్లలను కాపాడుకోవడానికి పాముని గూటి నుంచి బయటకు రప్పించే ప్రయత్నం చేసింది. పాముతో పక్షి పోరాడింది. అంతేకాదు పాము తన పిల్లవైపు చూడానికి కూడా లేకుండా చేసింది. అయితే పాము పక్షిపై దాడి చేయడంతో చెట్టు నుంచి పాముతో పాటు పక్షి కిందకు పడ్డాయి. పాము కరవడంతో పాటు పక్షిని చుట్టి ఊపిరి ఆడకుండా చుట్టేసి చంపేసింది. అయితే ఆ పక్షి తాను మరణిస్తూ కూడా తన గుడ్లను కాపాడుకుంది.
వీడియోను ఇక్కడ చూడండి
వీడియోలో పాము ఒక పక్షి గూడులోకి ప్రవేశించింది. అయితే ఇది గమనించిన పక్షి పాముపై దాడి చేసి దానిని కిందకు పడేలా లాగేసింది. అయితే అదే సమయంలో పాము తన కోరతో పక్షిని కాటు వేసింది. పక్షిని చుట్టేసి చంపేసింది. ఈ వీడియోను natureismetal అనే Insta ఖాతాలో షేర్ చేశారు. దీన్ని చూసిన తర్వాత ప్రపంచంలో ఎవరూ తల్లి ప్రేమ ముందు నిలబడలేరని కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో తల్లి కంటే గొప్ప శక్తి లేదని కామెంట్ చేశారు. మరొకరు తల్లి మాత్రమే తన పిల్లల కోసం ఈ త్యాగం చేయగలదన్నారు. మరొకరు పాము విషపూరితమైనప్పటికీ.. తల్లి ప్రేమ ముందు బలహీనంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..