Viral Video: 4 అడుగుల నాగుపాము.. ఒక్క అడుగు ముంగిసకు బలి..! షాకింగ్‌ వీడియో వైరల్‌

పడగ విప్పి కనిపించిన నాగుపామును చూస్తే అది ప్రమాదకరమైన జీవి అయినప్పటికీ.. చూస్తున్న వారికి నరాలు ఉప్పొంగేలా చేస్తుంది. కానీ, ఇక్కడ మాత్రం షాకింగ్ సీన్‌ కనిపించింది. పడగ విప్పి ప్రశాంతంగా నిలబడి ఉన్న ఆ నాగుపామును మృత్యువు వెంబడించింది. మరికొందరు మాత్రం ఇది నిజమా లేక క్రియేట్‌ చేశారా అని కూడా అడుగుతున్నారు. కానీ, చాలా మంది దీనిని ప్రకృతి అద్భుతంగా అభివర్ణించారు.

Viral Video: 4 అడుగుల నాగుపాము.. ఒక్క అడుగు ముంగిసకు బలి..! షాకింగ్‌ వీడియో వైరల్‌
King Cobra

Updated on: Oct 08, 2025 | 6:21 PM

అడవిలో పాములు, ముంగిసల మధ్య పోటీ శతాబ్దాల నాటిది. కానీ సోషల్ మీడియా దానికి కొత్త కోణాన్ని ఇచ్చింది. తాజా వైరల్ వీడియోలో నాలుగు అడుగుల పొడవైన నాగుపాము ప్రపంచాన్ని పట్టించుకోనట్లుగా తన పడగను విస్తరించి కూర్చుంది. కానీ, దానికి తెలియదు.. తాను మరణం నీడలో దాక్కుని ఉన్నాని.. ఒక చిన్న పాదాలతో అడుగు కూడా లేని ముంగిస వెనుక నుండి దూసుకు వచ్చి కేవలం 10 సెకన్లలో నాగుపాముని బలితీసుకుంది. sudais7314 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌, వేల కామెంట్లతో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీడియో ప్రారంభంలో ఒక నాగుపాము కనిపిస్తుంది. అది సరిగ్గా నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. దాని పడగ విస్తరించి ఉంది. ఇలా పడగ విప్పి కనిపించిన నాగుపామును చూస్తే అది ప్రమాదకరమైన జీవి అయినప్పటికీ.. చూస్తున్న వారికి నరాలు ఉప్పొంగేలా చేస్తుంది. కానీ, ఇక్కడ మాత్రం షాకింగ్ సీన్‌ కనిపించింది. పడగ విప్పి ప్రశాంతంగా నిలబడి ఉన్న ఆ నాగుపామును మృత్యువు వెంబడించింది. నాగుపాము పడగపై అమాంతంగా దాడి చేసిన ముంగిస దాన్ని కలదకుండా చేసింది. దాని దంతాలను పాము శరీరంలోకి గుచ్చి బలంగా పట్టేసుకుంది. పాము ఊపిరి ఆగిపోయింది. సుమారు పది సెకన్ల క్రితం ప్రజలకు భయాన్ని కలిగించిన నాగుపాము ఇప్పుడు నిస్సహాయంగా తన చివరి శ్వాసలను లెక్కిస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోను @sudais7314 అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేయబడింది. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు 5 లక్షలకు పైగా వీక్షించారు. వ్యాఖ్యల విభాగంలో నెటిజన్ల అభిప్రాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకరు ఇలా రాశారు, ముంగిస అనుకుంటుంది.. సోదరా ఈ రోజుకి నువ్వే నా బ్రేక్‌ఫాస్ట్‌ అని.. మరొకరు రాశారు ఆట 10 సెకన్లలో ముగిసింది, కోబ్రా సంగతేంటి!’ అని అడుగుతున్నారు. మరికొందరు మాత్రం ఇది నిజమా లేక క్రియేట్‌ చేశారా అని కూడా అడుగుతున్నారు. కానీ, చాలా మంది దీనిని ప్రకృతి అద్భుతంగా అభివర్ణించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..