భారతదేశం భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజాస్వామ్యం, చరిత్ర, వారసత్వం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని బహుళసాంస్కృతికత భారతీయులనే కాదు విదేశీయులను కూడా ఆకర్షిస్తోంది. భారతీయ సంస్కృతిని ఇష్టపడే వారిలో మెక్సికోకు చెందిన జాక్వెలిన్ మోరేల్స్ క్రూజ్ కూడా ఒకరు. ఈ మెక్సికేన్ యువతికి ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నివసిస్తోంది. ఈ మెక్సికేన్ యువతికి మన దేశం తెగ నచ్చేసిందట. ప్రతిరోజూ సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకుంటూనే ఉంటుంది. భారత్ లో తాను ఎంత సురక్షితంగా ఉన్నానో తాజాగా ఓ వీడియోలో చెప్పింది.
భారత దేశం గురించి జాక్వెలిన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా ఒక విదేశీ వ్యక్తీ నోటి నుంచి వినడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. జాక్వెలిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ.. భారత దేశాన్ని తన ఇల్లు అని చెప్పడం తనకు చాలా సంతోషంగా ఉంది’ అని రాసింది. భారత్‌లో మహిళల భద్రతపై విదేశీయులకు చాలా అపోహలు ఉన్నాయని ఓ కార్యక్రమంలో ఆమె చెప్పింది. భారత్‌లో తనకు మంచి అనుభావాలు ఎదురయ్యాయని.. ఇక్కడ సంస్కృతి, ప్రజలు, పర్యావరణం తనకు సురక్షితంగా అనిస్తున్నట్లు చెప్పింది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
వీడియోలో జాక్వెలిన్ భారతదేశంలో చాలా సురక్షితంగా ఉందని చెప్పడం వినవచ్చు. భారతీయ సంప్రదాయ దుస్తులైనా, పాశ్చాత్య వస్త్రాలైనా సరే ఈ దేశంలో ఏదైనా ధరించే స్వేచ్ఛ ఇక్కడి వారికి ఉంది. అయితే ఆ యువతి వీడియోపై మిశ్రమ స్పందనలు కనిపించాయి. ఆనే మాటలను కొందరు సమర్ధించగా, మహిళలపై పెరుగుతున్న నేరాలను పేర్కొంటూ మరికొందరు నిరసనలు కూడా వ్యక్తం చేశారు.
ఒకరు మీరు ఖచ్చితంగా విదేశీయులకు స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. మరొకరు ఎవరైనా భారతదేశం గురించి సానుకూలంగా మాట్లాడటం చాలా బాగుంది, లేకపోతే కొంతమంది భారతదేశాన్ని దిగజార్చడానికి ప్రతికూల కథనాన్ని సెట్ చేస్తారు అని కామెంట్ చేశాడు. నీ గురించి నాకు తెలియదు.. కానీ భారతీయ మహిళగా నేను సురక్షితంగా లేను. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లలేనని మరొకరు వ్యాఖ్యానించారు, అయితే మహిళలపై పెరుగుతున్న నేరాల గురించి ఏమిటని ప్రశ్నించారు ఒకరు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..