Viral Video: ముంబై వీధుల్లో ఈత కొట్టిన భారీ కొండ చిలువ… నీళ్ల మడుగులో తల బయటపెట్టిన వీడియో వైరల్‌

ఇటీవల భారీ వర్షాలతో...దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉరుములు...

Viral Video: ముంబై వీధుల్లో ఈత కొట్టిన భారీ కొండ చిలువ... నీళ్ల మడుగులో తల బయటపెట్టిన వీడియో వైరల్‌
Python In Mumbai Floods

Updated on: Jun 05, 2025 | 3:07 PM

ఇటీవల భారీ వర్షాలతో…దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.

వర్షాలు, వరదలతో పాటు పాములు, కొండ చిలువలు కూడా వీధుల్లోకి వస్తున్నాయి. తాజాగా.. ముంబై వీధుల్లోకి ఓ భారీ కొండ చిలువ నీళ్లలో కొట్టుకు వచ్చింది. స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఓ రోడ్డుపై నిండా నీళ్లు నిలిచిపోయాయి. నీళ్ల పై నుంచి భారీ కొండచిలువ తల బయటపెట్టి రోడ్డు వైపు చూసింది. ఆకుపచ్చ రంగులో సడెన్‌గా కొండ చిలువ కనిపించడంతో స్థానికులు షాకయ్యారు. అక్కడున్న కొంత మంది గమనించి వెంటనే తమ ఫోన్ లో రికార్డ్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాలో సర్పమిత్ర్‌ అష్టవినాయక్‌ రాక్‌ పైథాన్‌ పేరిట షేర్‌ చేసిన వీడియోకు 6.7 million views 2,68,000 likes వచ్చాయి. నెటిజన్లు కామెంట్లు మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. నాకు పైథాన్‌ వచ్చు.. దాంతో మాట్లాడే ప్రయత్నం చేయనా అని ఓ యూజర్ ఫన్నీగా కామెంట్‌ చేయడం అందరినీ ఆకట్టుకుంది.

వీడియో చూడండి: