
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రకరకాల రీల్స్ చేసి లైక్‌లు , వ్యూస్ కోసం తపిస్తున్నారు. అందుకే ఎల్లప్పుడూ విభిన్నమైన కంటెంట్‌ను సృష్టించడం గురించి ఆలోచిస్తారు. చాలా మంది తమ వీడియోలతో నవ్వు తెప్పిస్తుండగా, కొంతమంది సృజనాత్మకంగా ఏదైనా చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలని భావించే వ్యక్తులు ఉన్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో ప్రమాదకరమైన ప్రయోగం చేశాడు. ఇది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
వీడియోలో ఒక వ్యక్తి ఫ్యాన్ రెక్కలకు స్టీల్ ఊలు ఉంచి నిప్పు పెట్టాడు. ఆతర్వాత ఫ్యాన్‌ను ఆన్ చేసి గదిలోని లైట్లు ఆపివేయడం చూడవచ్చు. ఫ్యాన్ తిరగడం మొదలు పెట్టిన వెంటనే స్టీల్ ఉన్నికి ఉన్న నిప్పురవ్వలు గదిని ప్రకాశవంతం చేయడం మొదలు పెట్టాయి. ఈ రీల్ కేవలం 1214 సెకన్ల నిడివి మాత్రమే ఉంది. అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. అదే సమయంలో కొంచెం ప్రమాదకరం అని కూడా అనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ప్రజాదరణ పొందింది. స్లో మోషన్‌లో చూసినప్పుడు ఈ వీడియో మరింత అందంగా కనిపిస్తుంది.
వీడియోను ఇక్కడ చూడండి
ఈ వీడియో చివరలో ఇది ఒక రకమైన ప్రమాదకరమైన స్టంట్ అని .. ఇంట్లో దీన్ని ప్రయత్నించవద్దని సృష్టికర్త స్వయంగా ప్రజలను హెచ్చరించారు. ఎందుకంటే ఇది తీవ్రమైన హాని కలిగించవచ్చు. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉందని చూపరులు చెబుతున్నారు. ఒక రోజులో 8 కోట్లకు పైగా ప్రజలు దీనిని చూశారు. రకరకాల వ్యాఖ్యలతో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఈ వీడియోను ashu.ghai అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేశారు. దీన్ని చూసిన తర్వాత ఇది చాలా బాగుంది కానీ నిజం చెప్పాలంటే గదికి చాలా నష్టం కలిగించిందని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు ఇది చాలా అందంగా కనిపిస్తుందని.. అయితే ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు వ్యూస్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..