Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. వాషింగ్ మెషీన్ ను సారెగా మార్చిన కుమ్మరి.. చకచకా మట్టి దీపాలు తయారీ..

మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ రకాల అసాధారణ వీడియోలను చూస్తుంటాము. ఆ వీడియోలో కొన్ని దేశీయ జుగాడ్ లు కూడా ఉంటాయి. కొన్ని జుగాడ్ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుని వేగంగా వైరల్ అవుతూ ఉంటాయి. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి విరిగిన వాషింగ్ మెషీన్ ఉపయోగించి మట్టి దీపాలను తయారు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అతని చాతుర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. వాషింగ్ మెషీన్ ను సారెగా మార్చిన కుమ్మరి.. చకచకా మట్టి దీపాలు తయారీ..
Viral Video

Updated on: Oct 01, 2025 | 11:04 AM

సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్‌గా ఉన్నవారికి రోజూ రాకరకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని రకాల వీదియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేవిగా ఉంటాయి. మరొకొన్ని ఆశ్చర్యపరిచే వీడియోలు ఉంటాయి. కొన్ని జుగాడ్ వీడియోలు ఫన్నీగా ఉండడమే కాదు.. అవతలి వ్యక్తి తెలివి తేటలకు నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి. మన దేశం ఎంత తెలివైన వ్యక్తులతో నిండి ఉందో తెలియజేసే దేశీ జుగాడ్ వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న వీడియో దేశీ జుగాడ్ లో వెరీ వెరీ స్పెషల్ అనిపిస్తుంది.

వీడియోపై ఓ లుక్ వేయండి..

కుమ్మరి చక్రంగా మారిన వాషింగ్ మెషీన్

సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి అందరినీ ఆలోచింపజేస్తున్నాడు. వీడియోలో చాలా పాతదైన వాషింగ్ మెషీన్ ఉంది. దాని బాడీ విరిగిపోయింది. అయితే వాషింగ్ మెషీన్ మోటారు చెక్కుచెదరకుండా ఉంది. ఈ మోటారుపై షాఫ్ట్ తిరుగుతుంది. ఈ షాఫ్ట్ ను కుమ్మరి చక్రంగా మార్చుకున్నాడు. ఆ సారే మీద ఒక వ్యక్తి చకచకా మట్టి దీపాలను తయారు చేయడం ప్రారంభించాడు. అవును మీరు సరిగ్గా చదివారు.. ఒక వ్యక్తి విరిగిన వాషింగ్ మెషీన్ ఉపయోగించి మట్టి దీపాలను చాలా సింపుల్ గా తయారు చేస్తున్నాడు.

ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు

ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో aapkaculture అనే ఖాతా ద్వారా షేర్ చేశారు.. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత.. ప్రజలు వివిధ రకాల ఫన్నీ కామెంట్స్ చేస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకరు.. “మొత్తం ప్రపంచంలోనే గొప్ప ఇంజనీర్ ఒక కుమ్మరివాడు” అని రాశారు. మరొకరు, “అమెరికా ఏమి చెప్పింది?” అని వ్యాఖ్యానించారు, మరొకరు, “మొత్తం టెక్నీషియన్ సమాజం ఇతని తెలివి చూస్తే భయపడుతోంది”అంటూ సరదాగా కామెంట్ చేశారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..