Watch: ఎవరు భయ్యా నువ్వు ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావ్‌.. వాడకమంటే ఇది..! బుల్డోజర్‌ను కూడా వదలకుండా..

|

Jun 28, 2024 | 12:26 PM

అయితే బుల్‌డోజర్‌లో ఏ చిన్న పార్ట్‌ అతని తలకి తగిలినా అది ప్రమాదమేనంటూ చాలా సోషల్ మీడియా వినియోగదారు రాశారు. ఇలాంటి నిజంగా అద్భుతమైన వ్యక్తులు అని మరొక సోషల్ మీడియా వినియోగదారు రాశారు! ఇది నీటి వృధా కాదా అని ఒకరు రాశారు. బుల్డోజర్ బకెట్‌లో కూర్చోబెట్టి అతన్ని నీళ్లలో వదిలేయండి అంటూ మరొకరు రాశారు.

Watch: ఎవరు భయ్యా నువ్వు ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావ్‌.. వాడకమంటే ఇది..! బుల్డోజర్‌ను కూడా వదలకుండా..
Bulldozer
Follow us on

సాధారణంగా పాత, పురాతన కట్టడాలు, మట్టి తవ్వకాల కోసం ఈ బుల్డోజర్‌ని ఉపయోగిస్తారు. కానీ, నేరగాళ్లకు గుణపాఠం చెప్పేందుకు దేశంలోని పలు రాష్ట్రాల్లో బుల్డోజర్‌ను ఉపయోగిస్తున్నారు. మాఫియాలపై చర్యలు తీసుకోవడానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదట ఈ బుల్డోజర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అయితే, బుల్డోజర్‌ను మరోలా కూడా వినియోగించవచ్చని చెబుతున్నాడో ఇక్కడ ఒక వ్యక్తి. అతడు బుల్డోజర్‌ను ఉపయోగించిన విధానం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇంతకు అతడు ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో ఒక వ్యక్తి బుల్డోజర్‌తో స్నానం చేస్తున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి నది లేదంటే, చెరువు ఒడ్డున నిలబడి బుల్డోజర్‌తో నీటిని బయటకు తీసుకుని స్నానం చేస్తున్నాడు. ఆ బుల్డోజర్ నదిలో నుండి నీటిని తీసి నిలబడి ఉన్న ఆ వ్యక్తిపై పోస్తోంది. ఇంటర్ నెట్‌లో ఈ వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది. గత రాత్రి తనకు బకెట్ కనిపించలేదని, అందుకే స్నానం చేయడానికి జెసిబిని ఉపయోగించాడని వీడియోపై రాసి వుంది. ఇప్పుడు ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో విపరీతంగా వీక్షిస్తున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ వ్యక్తి బుల్‌డోజర్‌తో స్నానం చేస్తున్నాడని, అయితే బుల్‌డోజర్‌లో ఏ చిన్న పార్ట్‌ అతని తలకి తగిలినా అది ప్రమాదమేనంటూ చాలా సోషల్ మీడియా వినియోగదారు రాశారు. ఇలాంటి నిజంగా అద్భుతమైన వ్యక్తులు అని మరొక సోషల్ మీడియా వినియోగదారు రాశారు! ఇది నీటి వృధా కాదా అని ఒకరు రాశారు. బుల్డోజర్ బకెట్‌లో కూర్చోబెట్టి అతన్ని నీళ్లలో వదిలేయండి అంటూ మరొకరు రాశారు.

మన దేశంలో ప్రతిభకు లోటు లేదని మరొకరు రాశారు. మన దేశం ఈ రకమైన ప్రత్యేక ట్యాలెంట్‌ గల వ్యక్తులకు ప్రసిద్ధి చెందిందని సోషల్ మీడియా వినియోగదారు రాశారు. ఇలాంటి ప్రతిభ మన దేశప్రజల రక్తంలోనే ఉందని మరొక సోషల్ మీడియా వినియోగదారు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..