కోవిడ్-19 నుండి రక్షణ కోసం మాస్క్ ధరించడం.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి సరైన జాగ్రత్తలు అవసరం. ప్రజల ఆరోగ్య భద్రత కోసం పబ్లిక్ ప్రదేశాల్లో టెంప్రేచర్ టెస్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు. అయితే కొన్నిసార్లు గార్డులు రద్దీ కారణంగా కొంతమందిని పట్టించుకోరు. మహమ్మారి ప్రోటోకాల్‌లను అనుసరించడానికి అవసరమైన పనులను పూర్తి చేయడం మన నైతిక బాధ్యతగా ఈ చిన్న అమ్మాయి చేసిన పని పెద్ద ఉదాహరణగా నిలిచింది.
ఆ చిన్నారి సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి తన ఉష్ణోగ్రతను తనిఖీ చేయమని అడుగుతుంది. ఆ అమ్మాయి చేసిన రిక్వెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వైరల్ అవుతోంది. ఆమె చేతిలో ఒక బొమ్మతో థర్మామీటర్‌తో చెక్ చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లింది. ఉష్ణోగ్రత తనిఖీ చేయడానికి ఆమె తన రెండు చేతులను ఒక్కొక్కటిగా చూపించింది.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి ఇంతగా సంతృప్తి చెందలేదు. తనను తాను తనిఖీ చేసుకున్న తర్వాత ఆమె సంతృప్తి చెందలేదు. వెంటనే చిన్నారి తన బొమ్మ ఉష్ణోగ్రతను కూడా తనిఖీ చేయించింది. ఆ తర్వాతే తాను అక్కడి నుంచి వెళ్లింది. “బాధ్యతగల పౌరుడు ఇలా ఉండాలి” అని పోస్ట్ ట్యాగ్ లైన్ జోడించారు. ఈ వీడియోను దినేష్ జోషి అనే యూజర్ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు.
ఆ చిన్నారి వీడియోను ఇక్కడ చూడండి:
A responsible citizen should be like this. @hvgoenka pic.twitter.com/7phGPk4rfm
— Dinesh Joshi (@officeofdnj) November 3, 2021
ఈ క్యూట్ వీడియో చూసిన నెటిజన్లు ఆ అమ్మాయిపై తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఒక యూజర్ తన కామెంట్ బాక్సులో ఇలా స్పందించారు. “ఈ వీడియో అందమైనది మాత్రమే కాదు, ప్రపంచానికి ఓ మంచి పాఠం కూడా ఉంది.” అని పేర్కొన్నారు. అదే సమయంలో మరొకరు ఇలా కామెంట్ చేశారు. ‘పూర్తి క్రెడిట్ అమ్మాయికి చెందిన తల్లిదండ్రులకు చెందుతుంది’ అని రాశారు. మరొక యూజర్ వ్యాఖ్యానిస్తూ, ‘ ఎంత చిన్న అమ్మాయి, కానీ ఎంత బాధ్యతగల పౌరుడు’ అని రాశారు. ఈ వీడియో చూసిన వారంతా ఈ అమ్మాయిని మెచ్చుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత మీరు కూడా అదే అంటారు.
ఇవి కూడా చదవండి: Drone Attack: బాగ్దాద్‌లో భారీ పేలుడు.. ప్రధానిని టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడి..
Income Tax: ఇళ్లు, భూమి కోనుగోలు చేస్తున్నారా.. ఈ విషయంను తప్పకా గుర్తుంచుకోండి..