viral video : వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అడవిలో తరచుగా జంతువుల మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆహరం కోసం మృగాలు చేసే దాడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం చిన్న జీవులు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇక సింహం వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక్కసారి దేనైనా టార్గెట్ చేశాయా దాన్ని అస్సలు మిస్ అవ్వవు సింహాలు. తాజాగా సింహం ఓ జంతువును వేటాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రజిని కాంత్ సినిమాలో చెప్పిన డైలాగ్ లా గుంపులు గుంపులుగా జంతువులు ఉన్నా సింహం సింగిల్ గా వచ్చి వేటాడింది ఈ వీడియోలో..
ఈ వైరల్ వీడియోలో అడవిలో జీబ్రా కు సింహం మధ్య ఫైట్ చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సింహం ఓ జీబ్రా పై దాడి చేసి దాన్ని తినేసే ప్రయత్నం చేస్తుంటే మిగిలిన జీబ్రాలు ఎదో టీవీ సీరియల్ సీరియస్ గా చూస్తున్నట్టు అలా చూస్తూ ఉండిపోయాయి. ఏ జీబ్రా అయినా వచ్చి కాపాడుతుందేమో అని చాలాసేపు సింహం నోటికి చిక్కిన జీబ్రా వెయిట్ చేసినప్పటికీ ఏ ఒక్కటి రాకపోవడంతో.. అది ఒంటరిగానే పోరాడింది. చివరకు సింహం కూడా పాపం అనుకుందేమో దాన్ని వదిలేసింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 130k వీక్షణలు మరియు 6k లైక్‌లు వచ్చాయి.