Viral Video: చిరుతపులిని ఎదురించిన కుక్క.. దాని అరుపులకు తోకముడిచిన చిరుత.. వీడియో వైరల్

|

Feb 14, 2022 | 8:05 PM

Viral Video: సాధారణంగా చిరు పులిని చూసి ఏ జంతువైనా భయపడుతుంది. ఎంతటి బలమైన జంతువులను సైతం చిరుత వేటాడుతుంటుంది. ఇతర జంతువులపై చిరుత..

Viral Video: చిరుతపులిని ఎదురించిన కుక్క.. దాని అరుపులకు తోకముడిచిన చిరుత.. వీడియో వైరల్
Follow us on

Viral Video: సాధారణంగా చిరు పులిని చూసి ఏ జంతువైనా భయపడుతుంది. ఎంతటి బలమైన జంతువులను సైతం చిరుత వేటాడుతుంటుంది. ఇతర జంతువులపై చిరుత దాడి చేయడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలను చూస్తూనే ఉంటాము. కానీ ఓ కుక్క మాత్రం చిరుతను ఎదురించింది. కుక్క అరుపులకు చిరుత తోక ముడిచి వెళ్లిపోయింది. ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 16 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 59 వేలకుపైగా మంది వీక్షించారు. 4వేలకుపైగా లైక్స్‌ వచ్చాయి. రోడ్డు పక్కన కూర్చున్న ఓ కుక్కపై చిరుత దాడి చేయబోయింది. వెంటనే కుక్క లేచి నిలబడి చిరుతపై కోపంత రగిలిపోయింది. ఆ చిరుత అక్కడి నుంచి వెళ్లే వరకు కుక్క ఆరుస్తూనే ఉంది. ఈ కుక్క అరుపులతో చిరుతపులి తోకముడిచి వెళ్లిపోయింది. ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చుని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి:

Viral Video: చిరుత వేటాడితే ఇలానే ఉంటుంది.. గాల్లో తేలియాడుతూ.. డేంజరస్ వీడియో

Funny Video: అందుకే బ్యాక్ బెంచర్ ముందు కూర్చోకూడదు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో