Watch Video: కరెంటు, బొగ్గు లేకుండా పాత కాలంలో బట్టలు ఎలా ఇస్త్రి చేసేవారో తెలుసా..? అలానాటి మేటి వీడియో వైరల్‌..

|

Jan 24, 2024 | 9:13 PM

మేము బొగ్గులతో చేసే ఐరన్‌ బాక్స్‌ను ఉపయోగించాము.. కాని కిరోసిన్ ఆధారిత ఐరన్‌ బాక్స్‌ చూడటం ఇదే మొదటిసారి అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. పాత వస్తువులను భద్రపరిచినందుకు ఈ వ్యక్తిని గౌరవించాలని మరొకరు రాశారు. చాలా మంది ప్రజలు అలాంటి వాటిని అమ్మేస్తుంటారని, లేదంటే పడవేస్తుంటారని, కానీ, ఇలాంటి వస్తువులను గొప్ప నిధిగా దాచుకున్నారంటూ ప్రశంసించారు.

Watch Video: కరెంటు, బొగ్గు లేకుండా పాత కాలంలో బట్టలు ఎలా ఇస్త్రి చేసేవారో తెలుసా..? అలానాటి మేటి వీడియో వైరల్‌..
Kerosene Iron
Follow us on

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్‌ ఉంటుంది. కరెంటువి అందుబాటులో లేనంత వరకు బొగ్గుతో బట్టలు ఐరన్‌ చేసుకునేవారు.. కానీ కరెంటు, బొగ్గు లేని సమయంలో బట్టలు ఎలా ఇస్త్రి చేసుకునే వారో తెలుసా? ఈ రోజు మనం ఆనాటి పాత ఐరన్‌ బాక్స్‌ ఎలా పనిచేసేదో తెలుసుకుందాం.. ఇది కిరోసిన్ ఆయిల్‌తో పనిచేసే ఐరన్‌ బాక్స్.. దీని పని విధానం ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. @indiandesitraveller అనే యూట్యూబ్ ఛానెల్‌లో కిరోసిన్ ఆయిల్‌తో పనిచేస్తున్న ఐరన్‌ బాక్స్ పనితనం చూపించే వీడియో షేర్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏముందంటే..

పాతకాలంలో ఒక విచిత్రమైన పద్దతిలో తయారు చేసిన ఐరన్‌ బాక్స్‌ ఉపయోగించేవారు. ఇది పొయ్యి మీద పెట్టి వేడి చేయటం ద్వారా బట్టలు ఇస్త్రి చేస్తున్నారు. ఈ ఐరన్‌ బాక్స్‌ను బట్టలపై పెట్టి బలంగా నొక్కుతూ ఇస్త్రి చేస్తున్నారు. అంతే కాకుండా కిరోసిన్ ప్రెస్ కూడా ఉపయోగించారు. కిరోసిన్ ఐరన్‌ బాక్స్‌లో ఒక పంపు అమర్చబడింది. పంపింగ్ తర్వాత, కిరోసిన్ కాల్చడం ద్వారా ఐరన్‌ బాక్స్‌ వేడేక్కుతుంది. దానితో బట్టలు ఇస్త్రీ చేస్తున్నారు. వేడిచేసిన తరువాత ఈ ఐరన్‌ బాక్స్‌ను ఒక గుడ్డతో శుభ్రం చేస్తున్నారు.ఆ తర్వాత బట్టలపై బలంగా రుద్దుతున్నారు. స్టవ్‌లో పంప్‌ను అమర్చినట్లు, ఐరన్‌ బాక్స్‌లో కూడా అదే రకమైన పంపును అమర్చడం వీడియోలో చూడవచ్చు. పంప్ చేసినప్పుడు, కిరోసిన్ ఆయిల్ కాలిపోతుంది.. ఐరన్‌ బాక్స్‌ వేడేక్కుతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోని జనాలు బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో స్పందనలు కూడా వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

నా జీవితంలో ఇలాంటి కిరోసిన్ఐరన్‌ బాక్స్‌ చూడలేదని ఒకరు రాశారు. ఇది నిజంగా అద్భుతమైనది అంటూ మరోకరు స్పందించారు.. మేము బొగ్గులతో చేసే ఐరన్‌ బాక్స్‌ను ఉపయోగించాము.. కాని కిరోసిన్ ఆధారిత ఐరన్‌ బాక్స్‌ చూడటం ఇదే మొదటిసారి అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. పాత వస్తువులను భద్రపరిచినందుకు ఈ వ్యక్తిని గౌరవించాలని మరొకరు రాశారు. చాలా మంది ప్రజలు అలాంటి వాటిని అమ్మేస్తుంటారని, లేదంటే పడవేస్తుంటారని, కానీ, ఇలాంటి వస్తువులను గొప్ప నిధిగా దాచుకున్నారంటూ ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..