Viral Video: ఇదేం టాలెంట్‌ భయ్యో.. నెనెక్కడా చూడలా! జుగాడ్‌ బాప్‌కే బాప్‌ ఇది…

ఖరీదైన స్పోర్ట్స్ కారు కొనడానికి మీ దగ్గర డబ్బు లేకపోతే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బిబిన్ అనే వ్యక్తి దానికి సమాధానం కనుగొన్నాడు. కేరళకు చెందిన ఈ మెకానిక్ లగ్జరీ కార్‌ లంబోర్గిని దేశీ వెర్షన్‌ను తయారు చేసి నెటిజన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. అతడు తయారు చేసిన...

Viral Video: ఇదేం టాలెంట్‌ భయ్యో.. నెనెక్కడా చూడలా! జుగాడ్‌ బాప్‌కే బాప్‌ ఇది...
Desi Lamborghini Jugad

Updated on: Jul 08, 2025 | 10:19 AM

ఖరీదైన స్పోర్ట్స్ కారు కొనడానికి మీ దగ్గర డబ్బు లేకపోతే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బిబిన్ అనే వ్యక్తి దానికి సమాధానం కనుగొన్నాడు. కేరళకు చెందిన ఈ మెకానిక్ లగ్జరీ కార్‌ లంబోర్గిని దేశీ వెర్షన్‌ను తయారు చేసి నెటిజన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. అతడు తయారు చేసిన అద్భుతమైన కారుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉపేస్తుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో తాను దాదాపు మూడు సంవత్సరాల క్రితం పనిచేయడం ప్రారంభించానని బిబిన్ చెప్పాడు. లంబోర్గిని ‘దేశీ వెర్షన్’ను నిర్మించడానికి బిబిన్ స్క్రాప్ మెటీరియల్‌ను ఉపయోగించాడు. అవును, మీరు విన్నది నిజమే. అతను సమీపంలోని స్క్రాప్‌యార్డ్ నుండి జంక్ పార్ట్‌లను, స్థానిక హార్డ్‌వేర్ దుకాణాల నుండి ఇతర వస్తువులను సమీకరించుకుని కారు తయారు చేశాడు.

ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ అతను కారుకు నిజమైన లంబోర్గిని లుక్ ఇవ్వడానికి దాని బయటి బాడీపై కార్డ్‌బోర్డ్‌ను కూడా ఉపయోగించాడు. దీనితో పాటు, అతను మెటల్ పైపులు, ఫైబర్‌గ్లాస్ వంటి పదార్థాలను ఉపయోగించి తన బడ్జెట్‌ను కూడా నియంత్రణలో ఉంచుకున్నాడు.

ఒక కంపెనీలో నాణ్యత హామీ విభాగంలో పనిచేసే బిబిన్, పరిమిత నిధులు, సమయం లేకపోవడం వల్ల తాను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నానని, కానీ కారును తయారు చేయడం మాత్రం వదులుకోలేదని చెప్పాడు. తన దేశీ వెర్షన్ లంబోర్గిని పనిని ఇప్పటివరకు 80% పూర్తి చేశాడని, దానికోసం దాదాపు ఒకటిన్నర లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు.

‘దేశీ’ లంబోర్గినిలో ఆల్టో వీల్స్

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లంబోర్గిని చక్రాలు బడ్జెట్‌లో లేవు. దీంతో బిబిన్ తన విలాసవంతమైన కారుకు దేశీ తడ్కాను జోడించాలని నిర్ణయించుకున్నాడు. మారుతి ఆల్టో చక్రాలను ఉపయోగించాడు. ఇది మాత్రమే కాదు, అతను మొత్తం కారును చక్రాల పరిమాణానికి అనుగుణంగా తిరిగి డిజైన్ చేశాడు.

 

వీడియో చూడండి:

 

 


సోషల్ మీడియా వినియోగదారులు మెకానిక్ తన కలను నెరవేర్చుకోవడానికి చేసిన కృషిని, అభిరుచిని ప్రశంసిస్తున్నారు. యూట్యూబర్ అరుణ్ స్మోకీ బిబిన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అతని కథ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వేలాది మందికి చేరుకుంది. దీంతో నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. బిబిన్ ప్రతిభావంతుడు మాత్రమే కాదు, అతని అంకితభావం కూడా ప్రశంసనీయం అని పోస్టులు పెడుతున్నారు.