Viral Video: గుర్రంతో పరాచకాలు.. సీన్‌ కట్‌ చేస్తే ఎగిరెగిరి తన్నింది.. వీడియో చూస్తే నవ్వులే..

|

Aug 30, 2022 | 5:08 PM

Horse Video: మూగజీవాలతో ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిది. అప్పుడే అవి కూడా మనతో మంచిగా వ్యవహరిస్తుంటాయి. అయితే కొందరు మాత్రం జంతువులను తరచూ వేధిస్తుంటారు. ఆటపట్టిస్తుంటారు. అవేవీ చేయలేవన్న భావనే దీనికి ప్రధాన కారణం.

Viral Video: గుర్రంతో పరాచకాలు.. సీన్‌ కట్‌ చేస్తే ఎగిరెగిరి తన్నింది.. వీడియో చూస్తే నవ్వులే..
Horse
Follow us on

Horse Video: మూగజీవాలతో ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిది. అప్పుడే అవి కూడా మనతో మంచిగా వ్యవహరిస్తుంటాయి. అయితే కొందరు మాత్రం జంతువులను తరచూ వేధిస్తుంటారు. ఆటపట్టిస్తుంటారు. అవేవీ చేయలేవన్న భావనే దీనికి ప్రధాన కారణం. ఒక్కోసారి సాధు జంతువులతోనైనా హద్దుమీరి ప్రవరిస్తే ఎదురుదెబ్బలు తగలుతాయి. వాటి చేతిలో తీవ్ర ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ వీడియో కూడా అలాంటిదే. గుర్రంతో పరచకాలాడిన ఓ వ్యక్తికి అది తగిన సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గుర్రం దెబ్బకు సదురు వ్యక్తి అవమానకర రీతిలో కిందపడ్డాడు. అయితే నెటిజన్లు మాత్రం తగిన శాస్త్రి జరిగిందటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి గుర్రాన్ని రోడ్డుపై తీసుకెళుతుంటాడు. అయితే మరో వ్యక్తి ఆ గుర్రం వెనకాల నడుచుకుంటూ వచ్చి.. దాన్ని ఆటపట్టించేందుకు ప్రయత్నిస్తాడు. తన రెండు చేతులతో గుర్రం వెనకాల కొడతాడు. దీంతో గుర్రానికి పిచ్చెక్కిపోతుంది. అవసరంగా గెలికాడని.. వెంటనే తన రెండు వెనకాల కాళ్లతో వ్యక్తి మొహంపై ఎగిరి తన్నుతుంది. దీంతో ఆ వ్యక్తి ఎగిరి రోడ్డుపై పడతాడు. ఈ దృశ్యం చూసిన అక్కడున్న వారు పగలపడి నవ్వుకున్నారు. ఈ వీడియోను  The Darwin Awards అనే పేరుగల  ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. కేవలం 6 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చూసి నెటిజను పగలబడి నవ్వుకుంటున్నారు. కర్మ ఫలం అందే ఇదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..