మనసుంటే మార్గం ఉంటుంది. ఇతరులకు సాయపడాలన్న పెద్ద మనసు ఉంటే.. మనం ఏ స్థితిలో ఉన్నా సాయం చేయొచ్చు. దీన్ని చేతల్లో చేసి చూపించాడో హెలికాప్టర్ పైలట్. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో వివరాల్లోకి వెళ్తే.. హెలికాప్టర్‌లో గగనతలంలో వెళ్తున్న పైనట్‌కు కింద రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారం ఒంటరిగా తొలగిస్తున్న స్వీపర్ కనిపించాడు. స్వీపర్ ఈ పని పూర్తి చేయాలంటే ఎంతో శ్రమించడంతో పాటు చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. వెంటనే స్పందించిన పైలట్.. ఆ రోడ్డుపై అతి తక్కువ ఎత్తులో హెలికాప్టర్ నడిపాడు. హెలికాప్టర్ వింగ్స్ నుంచి వచ్చిన గాలి తీవ్రత కారణంగా రోడ్డు పూర్తిగా క్లీన్ అయ్యింది. దీంతో కేవలం క్షణాల వ్యవధిలో ఆ రోడ్డు తళతళ మెరిసిపోయింది. పైలట్ గొప్ప మనసును మెచ్చుకుంటూ స్వీపర్ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపాడు.
హెలికాప్టర్ పైలట్ పెద్ద మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. స్వీపర్‌కు పైలట్ సాయపడిన తీరు తమ గుండెలను పిండేస్తున్నట్లు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇతరులకు సాయపడే మంచి మనసున్న ఇలాంటి వ్యక్తులు ఈ ప్రపంచానికి చాలా అవసరమని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. దయాగుణంతో ప్రపంచంలో మార్పు తీసుకురావచ్చు.. ఇతరుల పట్ల ఎప్పుడూ దయతో నడుచుకోవాలంటూ మరో నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ చేశారు.
“Did we just become best friends?”
Helicopter pilot spots person sweeping and figures he can help them out. ? ? #bekind— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 27, 2021
Also Read..
Viral Video: నిద్రపోతున్న శునకాన్ని ఓ ఆటాడేసుకున్న పిల్లి.. నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..