Cat Viral Video: ఈ పిల్లి చేసిన పని చూస్తే.. మీ కళ్లను మీరే నమ్మలేరు.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Cat Viral Video: ఈ పిల్లి చేసిన పని చూస్తే.. మీ కళ్లను మీరే నమ్మలేరు.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Anil kumar poka

|

Updated on: Oct 27, 2021 | 5:25 PM

సోషల్‌ మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా చూస్తుంటాం. ఈ మధ్యం ఇలాంటి వీడియోలు నెట్టంట్లో బాగా బైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది.


సోషల్‌ మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా చూస్తుంటాం. ఈ మధ్యం ఇలాంటి వీడియోలు నెట్టంట్లో బాగా బైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ పిల్లి కిటికీ ఇనుప చువ్వల మధ్యలో నుంచి ఇంటిలోనికి రావడానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా పిల్లులు ఇలాగే చేస్తాయి.. అందులో ఆశ్చర్యమేముందని అనుకుంటున్నారా.. అక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ పిల్లి సైజు చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. పిల్లి చూస్తే పెద్దగా ఉంది. ఇనుప చువ్వల మధ్య గ్యాప్ చూస్తే చాలా తక్కువగా ఉంది. మరి అలాంటప్పుడు పిల్లి లోపలికి రావడం అసాధ్యం అనిపిస్తుందా లేదా… కానీ ఆ పిల్లి విక్రమార్కుడిలాగా పట్టు వదలకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ అతి కష్టంతో ఇనుప చువ్వల మధ్యలో నుంచి లోపలికి వచ్చేసింది. ఈ సీన్‌ మొత్తం వీడియోలో రికార్డయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. జంతు ప్రియులు, నెటిజన్స్‌కి ఈ వైరల్ వీడియో తెగ నచ్చేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్స్‌లో వీక్షించారు. లక్షల మంది లైక్‌ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే భలే నవ్వొస్తోంది.. క్యూట్‌ క్యాట్‌ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందుకే ప్రయత్నిస్తే సాధ్యంకానిదంటూ ఏమీ ఉండదన్న నానుడిని పిల్లి నిజం చేసిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)