Viral Video: మనసుంటే మార్గం ఉంటుంది.. రోడ్డుపైన వ్యక్తికి హెలికాప్టర్‌తో సాయపడిన పైలట్.. గుండెను పిండేసే వీడియో

Humanity Viral Videos: మనసుంటే మార్గం ఉంటుంది. ఇతరులకు సాయపడాలన్న పెద్ద మనసు ఉంటే.. మనం ఏ స్థితిలో ఉన్నా సాయం చేయొచ్చు.

Viral Video: మనసుంటే మార్గం ఉంటుంది.. రోడ్డుపైన వ్యక్తికి హెలికాప్టర్‌తో సాయపడిన పైలట్.. గుండెను పిండేసే వీడియో
Pilot Help Viral Videos
Follow us

|

Updated on: Oct 27, 2021 | 7:30 PM

మనసుంటే మార్గం ఉంటుంది. ఇతరులకు సాయపడాలన్న పెద్ద మనసు ఉంటే.. మనం ఏ స్థితిలో ఉన్నా సాయం చేయొచ్చు. దీన్ని చేతల్లో చేసి చూపించాడో హెలికాప్టర్ పైలట్. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో వివరాల్లోకి వెళ్తే.. హెలికాప్టర్‌లో గగనతలంలో వెళ్తున్న పైనట్‌కు కింద రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారం ఒంటరిగా తొలగిస్తున్న స్వీపర్ కనిపించాడు. స్వీపర్ ఈ పని పూర్తి చేయాలంటే ఎంతో శ్రమించడంతో పాటు చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. వెంటనే స్పందించిన పైలట్.. ఆ రోడ్డుపై అతి తక్కువ ఎత్తులో హెలికాప్టర్ నడిపాడు. హెలికాప్టర్ వింగ్స్ నుంచి వచ్చిన గాలి తీవ్రత కారణంగా రోడ్డు పూర్తిగా క్లీన్ అయ్యింది. దీంతో కేవలం క్షణాల వ్యవధిలో ఆ రోడ్డు తళతళ మెరిసిపోయింది. పైలట్ గొప్ప మనసును మెచ్చుకుంటూ స్వీపర్ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపాడు.

హెలికాప్టర్ పైలట్ పెద్ద మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. స్వీపర్‌కు పైలట్ సాయపడిన తీరు తమ గుండెలను పిండేస్తున్నట్లు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇతరులకు సాయపడే మంచి మనసున్న ఇలాంటి వ్యక్తులు ఈ ప్రపంచానికి చాలా అవసరమని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. దయాగుణంతో ప్రపంచంలో మార్పు తీసుకురావచ్చు.. ఇతరుల పట్ల ఎప్పుడూ దయతో నడుచుకోవాలంటూ మరో నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ చేశారు.

Also Read..

Viral Video: నిద్రపోతున్న శునకాన్ని ఓ ఆటాడేసుకున్న పిల్లి.. నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Cat Viral Video: ఈ పిల్లి చేసిన పని చూస్తే.. మీ కళ్లను మీరే నమ్మలేరు.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?