Viral Video: ఇంత విచిత్రమైన నిమ్మకాయను ఎప్పుడైనా చూశారా..! దెయ్యం లెమన్ అంటున్న నెటిజన్లు..

|

Jan 22, 2024 | 1:10 PM

బొప్పాయి సైజులో ఉన్నంత పెద్ద నిమ్మకాయను ఎప్పుడైనా చూసారా? ఐతే ఈ వైరల్ వీడియో చూడండి. ఈ వీడియో ఇప్పటికే వైరల్‌గా మారింది. ఈ నిమ్మకాయ సైజులో పెద్దగా ఉండటమే కాదు.. ఆకారంలో కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. దీంతో నెటిజన్లు ఈ నిమ్మకాయను చూసి ఆశ్చర్యపోతున్నారు. నిమ్మకాయ ఆకారంలో పెద్దదిగా ఉండడం మాత్రమే కాదు.. ఆకారంలో కూడా చాలా వింతగా ఉంది.

Viral Video: ఇంత విచిత్రమైన నిమ్మకాయను ఎప్పుడైనా చూశారా..! దెయ్యం లెమన్ అంటున్న నెటిజన్లు..
Unique Lemon Video
Follow us on

మార్కెట్‌లో లభించే నిమ్మకాయలు సాధారణంగా చిన్నవి, గుండ్రని పరిమాణంలో ఉంటాయి. కొన్నిసార్లు అరుదైన సందర్భాల్లో కొన్ని నిమ్మకాయలు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. అంతేకాదు ఒక నిమ్మకాయ గరిష్టంగా 100 నుండి 200 గ్రాముల బరువు ఉంటుంది. అయితే బొప్పాయి సైజులో ఉన్నంత పెద్ద నిమ్మకాయను ఎప్పుడైనా చూసారా? ఐతే ఈ వైరల్ వీడియో చూడండి. ఈ వీడియో ఇప్పటికే వైరల్‌గా మారింది. ఈ నిమ్మకాయ సైజులో పెద్దగా ఉండటమే కాదు.. ఆకారంలో కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. దీంతో నెటిజన్లు ఈ నిమ్మకాయను చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో @maxiskitchen అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భాగస్వామ్యం చేయబడింది. ఈ వీడియోలో ఒక మహిళ నిమ్మకాయను కత్తిరించడం చూడవచ్చు. అయితే ఆ నిమ్మకాయ ఆకారంలో పెద్దదిగా ఉండడం మాత్రమే కాదు.. ఆకారంలో కూడా చాలా వింతగా ఉంది. వైరల్ వీడియోలో ఒక మహిళ తన పెరట్లో ఉన్న ఒక చెట్టునుంచి పసుపు క్యాప్సికమ్ లాగా కనిపించే పెద్ద నిమ్మకాయను కోసింది. నిమ్మకాయను కట్ చేసి చూస్తే దాని లోపలి భాగం చాలా విలక్షణంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి 30.6 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ వచ్చాయి. కామెంట్లు కూడా ఓ రేంజ్ లో వెల్లువెత్తాయి. ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు ఈ పెద్ద నిమ్మకాయను చూసినప్పుడు నేను ఎందుకు భయపడుతున్నానని అంటే.. మరొకరు “ఇది వైరల్ నిమ్మకాయ” అంటూ ఫన్నీ కామెంట్ రాశారు. మరోకరు “దెయ్యంలా ఉంది, తినవచ్చా?” అని అడిగాడు. ఐతే కొంతమంది ఈ ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న నిమ్మకాయను చూసి ఇది చాలా భయానకంగా ఉందని అంటే.. మరికొందరు వావ్ ఈ నిమ్మకాయ చాలా కళాత్మకంగా ఉందని వ్యాఖ్యానించారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..