ఈ భూమ్మీద అతి భయంకరమైన క్రూర మృగాలు పులులు, సింహాలు. వీటి ఆహారం ఇతర జంతువులు, మనషులే.. వీటి కంటపడిన జీవిని క్షణాల్లో చంపేస్తాయి. అలాంటి భయంకరమైన మృగాలతో కొందరు అప్పుడప్పుడు ఆటలు ఆడుతుంటారు..చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి గేమ్స్ ఆడారు ఇక్కడ కొందరు యువకులు.. అడవిలో చిరుతపులితో గేమ్స్ ఆడాలనుకున్నారు..కట్ చేస్తే అదే వారికి సినిమా చూపించింది. ఆ పులికి కోపం వచ్చి వెంబడించి దాడి చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ ప్రాంతంలో జరిగింది ఈ షాకింగ్ ఘటన. ఇక్కడ విహారయాత్రకు వెళ్లిన కొందరు యువకులు చావు అంచులదాకా వెళ్లి, చావు తప్పి బయటపడ్డారు. షాహ్‌దోల్‌లోని ఖితౌలీ శ్రేణి అడవిలో సోన్ నది ఒడ్డున విహారయాత్రకు వెళ్లిన కొందరు వ్యక్తులు దూరంగా వెళ్తున్న చిరుతపులిని చూశారు.. వెంటనే ఆ చిరుత కదలికలను వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించారు. మొబైల్ లో రికార్డింగ్ చేస్తూ.. ‘రండి రా’ అంటూ చిరుతపులిని ఆటపట్టించడం మొదలుపెట్టారు. వారి అరుపులకు ఆగ్రహించిన చిరుత ఒక్కసారిగా వారి వద్దకు పరుగెత్తి దాడి చేసింది. అదృష్టవశాత్తు పెద్ద సంఖ్యలో జనం అరుపులు, కేకలు వేస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు.. దాంతో ఆ చిరుత వెనక్కి వెళ్లిపోయింది. ఒక మహిళ, ఓ పోలీసు అధికారితో సహా అక్కడి వారిలో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. ఇద్దరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో షేర్ చేయగా, అది చాలా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రజలు చిరుతపులిని వేధించినందుకు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
शहडोल से सटे जंगल में पिकनिक मनाने गए लोगो पर तेंदुए के हमले का लाइव वीडियो. pic.twitter.com/09Hv4L3rLl
— Sanjay Lohani 🇮🇳 (@SanjayLohani76) October 21, 2024
అక్టోబర్ 20 ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన 30 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారంతా అరుస్తూ చిరుతను తమ వైపుకు పిలుస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొంత మంది ఈ దృశ్యాన్ని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటన జరిగిన షాడోల్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం కూడా పర్యాటకులపై టైగర్ దాడి చేసింది. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పులి దాడి జరిగిందని షాడోల్ ఎస్‌డిఎఫ్‌ఓ బాద్షా రావత్ తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజలు ఇక్కడి అడవుల్లోకి వెళ్లవద్దని అటవీశాఖ సూచించింది. ప్రజలేవరూ ఇక్కడి సమీప ప్రాంతాల్లో ఒంటరిగా కూడా తిరగొద్దని పదే పదే హెచ్చరించారు. ఇలాంటి ఘటనల్లో సహాయం చేసేందుకు కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..