Dog Attack: కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే కొన్ని కుక్కలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఉన్నట్లుండి మనుషులపై దాడి చేస్తుంటాయి. ఎక్కడి పడితే అక్కడ పడి కరిచేస్తుంటాయి. ఒక్కోసారి కుక్కల బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈనేపథ్యంలో ఓ జొమాటో డెలివరీ బాయ్‌కు కూడా ఇలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది. వీరి ఉద్యోగాలు ఎంతటి కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన పార్శిళ్లను డెలివరీ చేయడానికి రాత్రనకా, పగలనకా కష్టపడుతుంటారు. గమ్యస్థానానికి వేగంగా వెళ్లే ప్రయత్నంలో ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా ముంబైలో ఓ జొమాటో ఉద్యోగికి కూడా ఇలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. పన్వేల్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో డెలివరీ ఇచ్చి వస్తున్న నరేంద్ర పెరియార్ అనే జొమాటో ఎగ్జిక్యూటివ్ శునకం బారిన పడి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఈ కుక్కదాడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.
ఈ వీడియెలో ఒక జొమాటో డెలివరీ బాయ్ లిఫ్ట్‌లో కిందకు వచ్చే సరికి ఎదురుగా ఒక జర్మన్ షెపర్డ్ శునకం కనిపిస్తుంది. దాన్ని చూసి బెదిరిన నరేంద్ర ముందు జాగ్రత్తగా వెనకడుగు వేశాడు. ఆ కుక్క యజమాని దాన్ని పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో పెరియార్ లిఫ్టులో నుంచి బయటకు వచ్చాడు. అయితే పెరియార్ బయటకు రాగానే ఆ కుక్క అతనిపై దాడి చేసింది. అతని ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసింది. దీంతో అక్కడివారు అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స తీసుకున్నా నొప్పి తగ్గలేదంటున్నాడు బాధితుడు. పెరియార్ మెడికల్ బిల్లులను కుక్క యజమానే భరిస్తున్నాడు. కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాటికి సరైన శిక్షణ ఇచ్చి చైన్ వేసి ఉంచాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.
#Watch | German Shepherd bites #Zomato delivery executive’s crotch in #Panvel apartment complex https://t.co/UJVjLXGp26#GermanShepherd #Shocking #ShockingVideo #ZomatoDeliveryBoy #Viral #ViralVideo pic.twitter.com/c2nUGPMnpa
— Free Press Journal (@fpjindia) August 31, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..