Viral Video: ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇట్లనా.. బాధ్యత ఉండక్కర్లే?… యువకుడిని ఏకి పారేస్తున్న నెటిజన్స్‌

కూతురు మీద ప్రేమ.. ఆ తండ్రికి విమర్శలు తెచ్చిపెట్టింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో పట్ల నెటిజన్స్‌ తీవ్రంగా స్పందిస్తున్నారు. కొడుకు మీద కంటే కూతురు మీద తండ్రికి అలాగే తండ్రి మీద కూతురుకు బాండింగ్‌ ఎక్కుంగా ఉంటుందని...

Viral Video: ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇట్లనా.. బాధ్యత ఉండక్కర్లే?... యువకుడిని ఏకి పారేస్తున్న నెటిజన్స్‌
Father And Daughter Ride

Updated on: Nov 24, 2025 | 5:40 PM

కూతురు మీద ప్రేమ.. ఆ తండ్రికి విమర్శలు తెచ్చిపెట్టింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో పట్ల నెటిజన్స్‌ తీవ్రంగా స్పందిస్తున్నారు. కొడుకు మీద కంటే కూతురు మీద తండ్రికి అలాగే తండ్రి మీద కూతురుకు బాండింగ్‌ ఎక్కుంగా ఉంటుందని అంటారు. ఈ క్రమంలో కూతురు పట్ల తండ్రి స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపుతుంటాడు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కూతురిని బైక్ పై స్కూల్ కి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

బైక్‌పై కూతురుని తన వెనక సీటు మీద కూర్చోబెట్టకుండా ముందు పెట్రోల్‌ ట్యాంక్‌ మీద తనకు ఎదురుగా కూర్చోబెట్టాడు. తండ్రి తాను హెల్మెట్‌ ధరించినా కూతురుకు హెల్మెట్ పెట్టలేదు. రద్దీగా ఉండే రోడ్డులో కూతురుతో మాట్లాడుతూ వేగంగా బైక్ నడుపుతున్నాడు. ఇంత సంచలనాత్మక సంఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ అయింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ రికార్డ్ చేయబడిందో వీడియో నుండి స్పష్టంగా తెలియదు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు రద్దీగా ఉండే రోడ్డు గుండా అతివేగంగా బైక్ నడుపుతున్నట్లు కనిపిస్తుంది. తలపై హెల్మెట్, వీపుపై బ్యాగ్ ధరించి ఉన్నాడు. ముందు భాగంలో తన కుమార్తెను పెట్రోల్‌ ట్యాంక్ పై హెల్మెట్ లేకుండా కూర్చుంది. కానీ ఆ అమ్మాయి తన తండ్రికి ఎదురుగా కూర్చుని ఉంది. ఆమె తన తండ్రితో కూడా మాట్లాడుతూ ఉంది. ఆ యువకుడు మద్యం తాగి ప్రమాదకరమైన రీతిలో బైక్ నడుపుతున్న కథనం ఇది. వెనుక ఉన్న కారు నుండి ఒక ప్రయాణీకుడు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియో వెలుగులోకి వచ్చింది.

వైరల్ వీడియోను ఓక్ ఎమినెంట్ అనే X హ్యాండిల్ పోస్ట్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్‌ లైక్‌లు, కామెంట్స్‌ చేస్తున్నారు. నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. వీడియోను చూసిన నెటిజన్లలో చాలామంది తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అలాగే చాలామంది తమ చిరాకును వ్యక్తం చేశారు. విమర్శలు వెల్లువెత్తాయి. చాలామంది ఆ యువకుడిని ‘బాధ్యతారహిత తండ్రి’ అని పిలిచారు. యువకుడిని శిక్షించాలని కొంతమంది డిమాండ్ చేశారు. “స్పష్టంగా బాధ్యతారహిత తండ్రి. మీరు మీ గురించి ఆలోచించకపోయినా, మీరు మీ కుమార్తె గురించి ఆలోచించాలి అని ఒక నెటిజన్ కామెంట్‌ పెట్టారు.

వీడియో చూడండి:

Follow Us