ఆ పాత మధురం అంటూ ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని, బాల్య స్మృతులను, చిన్న నాటి స్నేహితులను, స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంటారు. అంతేకాదు ఎంత పెద్దవారు అయినా ఎంత గొప్ప గొప్ప ఉద్యోగాలు, వ్యాపారం చేస్తున్నా ఒక గురువుకు శిష్యుడే అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.. అంతేకాదు తమకు ఇష్టమైన ఉపాద్యాయులను గుర్తు చేసుకోని వారు బహు అరుదనే చెప్పవచ్చు. తాము చదువుకునే రోజుల్లోని స్నేహితులను, టీచర్స్ ను గుర్తు చేసుకోవడమే కాదు.. అందరూ కలిసి పెద్దరికంలో చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటారు. అవును స్నేహితులు, ఉపాధ్యాయులతో ఉన్న పాఠశాలకు చెందిన జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకోవడం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో స్కూల్ స్టూడెంట్స్ కు తమ బాల్యం పట్ల ఉండే వ్యామోహాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఓల్డ్ స్టూడెంట్స్ బృందం స్కూల్ లో కలుసుకున్నారు.. అసాధారణమైన రీతిలో పునఃకలయికను జరుపుకున్నారు. వరసలో నిల్చుకున్న స్టూడెంట్.. తమ స్కూల్ ప్రిన్సిపాల్ చేతిలో కర్ర దెబ్బలను తినడం కోసం వరుసలో నిల్చున్నారు. ప్రిన్స్ పాల్ చేతిలో కర్ర పట్టుకుని ఉన్నారు.. తన వద్దకు వచ్చిన స్టూడెంట్ వీపుపై ఒక దెబ్బ వేశారు. ఇలా ప్రిన్స్ పాల్ తో దెబ్బలు తినడానికి ఒకొక్క స్టూడెంట్ లైన్ లో అది కూడా స్కూల్ బ్యాగ్ ను వీపుకి వేసుకుని నిల్చోవడం విశేషం.
ప్రముఖ సోషల్ మీడియా పేజీ ఎక్స్‌లో కృష్ణ షేర్ చేసిన వీడియోలో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ లో కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యులు, విద్యావేత్తలతో సహా నిపుణులుగా ఉన్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ ఒక పాఠశాలలోని ఓల్డ్ స్టూడెంట్స్ విచిత్రమైన కలయిక ఉంది. కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, పాఠశాలల యజమానులు ఉన్నారు. వీరందరికీ ఒక కోరిక ఉంది. తమ పాఠశాల జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రిన్సిపాల్ తమని బెత్తంతో కొట్టాలి.. ఇలా ఎందుకంటే.. ప్రిన్స్ చేతి దెబ్బ ఫలితంగా తాము తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నామని నమ్మినట్లు చెప్పారు. “కర్ర దీవెన”ను ప్రిన్సిపాల్ చేతి నుంచి తీసుకున్నామని పేర్కొన్నారు.
Here’s a strange reunion of old students of a school.! There are collectors, police officers, doctors, advocates, principals, teachers, businessmen and owners of schools ! All of them have a desire…. The Principal should beat them with his cane to help them recollect their… pic.twitter.com/r0mkCaLkav
— Krishna (@Atheist_Krishna) August 13, 2024
లక్షలాది వ్యూస్ , వందల లైక్స్ ను సొంతం చేసుకున్న ఈ వీడియో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది. కొందరు తమ వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు. మరికొందరు నేటి విద్యా విధానం గురించి ప్రస్తావిస్తూ ఇటువంటి క్రమశిక్షణా పద్ధతులను అమలు చేస్తే ఎలా ఉంటుందో అంటూ చర్చించారు. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు ఇలాంటి చర్యలను తీసుకుంటే ఖచ్చితంగా సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చాలా మంది ఆ మాజీ ప్రిన్సిపాల్ వయస్సును కూడా ప్రశ్నించారు. కొందరు అతను ఓల్డ్ స్టూడెంట్స్ కంటే చిన్నవాడు అంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..