Viral Video: సీసీ కెమెరాలో కనిపించాడు.. బస్సులో చెక్ చేస్తే లేడు.. దెయ్యమేనా..?
దెయ్యం అని పేర్కొంటూ నెట్టింట పలు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని నమ్మాలో లేదో తెలీదు. ఎందుకంటే కొందరు ఎడిట్ చేసి వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు.

దెయ్యాలు ఉన్నాయా..? లేవా.. ఇది ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. దేవుడు ఉంటే దెయ్యం ఉన్నట్లే అని వాదించేవాళ్లు ఉన్నారు. దెయ్యం లేదు.. ఏం లేదు.. అందుకు సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవని కొట్టి పడేసేవారూ ఉన్నారు. అయితే దెయ్యం కనిపించింది అంటూ పలు వీడియోలు తరచూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భయం కలిగించేలా ఉంటాయి. తాజాగా ఓ బస్సులో ఘోస్ట్ ఉందంటూ ఓ వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. అందులో బస్సులో సీసీ టీవీ చెక్ చేయగా.. ఎవరో మనిషి ఉన్నట్లు కనిపిస్తుంది. లోపల బస్సు లోపలికి వెళ్లి చెక్ చేయగా అక్కడ ఎవరూ కనిపించడం లేదు. ఈ వీడియో దేశ రాజధాని ఢిల్లీకి చెందినదని చెబుతున్నారు. అయితే TV9 దీనిని ధృవీకరించలేదు.
వైరల్ అవుతున్న క్లిప్‌లో, ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో వీడియోను రికార్డ్ చేస్తున్నాడు. బస్సు పూర్తిగా ఖాళీగా ఉండటం.. ఒక్క పాసింజర్ కూడా లేకపోవడం మీరు గమనించవచ్చు. రాత్రి సమయంలో ఈ వీడియో చిత్రీకరించారు. ఫోన్‌లో వీడియో తీస్తుండగా.. బస్సులో ఎవరూ లేరు, అయితే బస్సులోని సీసీ కెమెరాను తనిఖీ చేయగా, తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి అక్కడ కూర్చున్నట్లు కనిపిస్తున్నాడు.
వీడియో దిగువన చూడండి….
View this post on Instagram
ఈ వీడియో చూసి చాలామంది షాక్‌కు గురవుతున్నారు. ఇది నిజమైన దెయ్యమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో దృష్టిని ఆకర్షించే ఉద్దేశ్యంతో ఎడిట్ చేసి అప్ లోడ్ చేసినట్లు కొందరు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో కాకుండా CCTVలో మాత్రమే కనిపించే అరుదైన దెయ్యం అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..